Andrew Symonds : ఆసిస్ మాజీ క్రికెట‌ర్ సైమండ్స్ మృతి

రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం

Andrew Symonds : ప్ర‌పంచ క్రికెట్ లో మ‌రో దిగ్గ‌జం నేల రాలింది. ఆస్ట్రేలియా క్రికెట్ గొప్ప క్రికెట‌ర్ ను కోల్పోయింది. 46 ఏళ్ల ఆండ్రూ సైమండ్స్ రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. రాత్రి టౌన్స్ విల్లేలో జ‌రిగిన కారు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

ఇటీవ‌లే మ‌రో క్రికెట్ దిగ్గ‌జ ఆట‌గాడు షేన్ వార్న్ మ‌ర‌ణించ‌గా ఇప్పుడు సైమండ్స్(Andrew Symonds) ను కోల్పోవ‌డం ఆసిస్ కు పెద్ద దెబ్బ‌. ఆయ‌న మృతితో క్రీడాభిమానులు తీవ్ర మ‌న‌స్థాపానికి గుర‌య్యారు.

వ‌చ్చీ రావ‌డంతోనే త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నాడు సైమండ్స్. ఆసిస్ కు అనేక విజ‌యాలు చేకూర్చి పెట్టాడు. స్పెష‌లిస్ట్ బ్యాట్స్ మెన్ గా పేరొందాడు. త‌న కెరీర్ లో 198 వ‌న్డేలు ఆడాడు.

2003, 2007లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ ను ఆస్ట్రేలియా చేజిక్కించు కోవ‌డంలో ఆండ్రూ సైమండ్స్(Andrew Symonds) కీల‌క పాత్ర పోషించాడు.

దిగ్గ‌జ క్రికెట‌ర్ సైమండ్స్ ను కోల్పోవ‌డం ప‌ట్ల ఆ దేశ ప్ర‌ధాన మంత్రి, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, మాజీ క్రికెట‌ర్లు మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్, గ‌వాస్క‌ర్, వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌, రాహుల్ ద్ర‌విడ్ , పాకిస్తాన్ బౌల‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ తీవ్ర సంతాపం తెలియ చేశారు.

ఆసిస్ తాజా, మాజీ ఆట‌గాళ్లు షాక్ కు గుర‌య్యారు. ఇక సైమండ్స్ మొద‌టిసారిగా 1998లో పాకిస్తాన్ తో అరంగేట్రం చేశాడు. వ‌న్డేల్లో 6 సెంచ‌రీలు, 30 హాఫ్ సెంచ‌రీలు చేశాడు.

బౌలింగ్ లో 133 వికెట్లు తీసి స‌త్తా చాటాడు. టెస్టు కెరీర్ 2004లో శ్రీ‌లంక‌తో స్టార్ట్ చేశాడు. ఇందులో 2 సెంచ‌రీలు 10 హాఫ్ సెంచ‌రీలు చేశాడు. టీ20లో 14 మ్యాచ్ లు ఆడాడు. 337 ర‌న్స్ చేశాడు. 2012లో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ నుంచి త‌ప్పుకున్నాడు సైమండ్స్ .

Also Read : ల‌క్నో వ‌ర్సెస్ రాజ‌స్థాన్ బిగ్ ఫైట్

Leave A Reply

Your Email Id will not be published!