Mitchell Marsh : స‌త్తా చాటిన‌ మిచెల్ మార్ష్

ఢిల్లీ గెలుపులో కీల‌క పాత్ర

Mitchell Marsh : ఐపీఎల్ 2022లో కీల‌క‌మైన మ్యాచ్ లో రిష‌బ్ పంత్ సార‌థ్యంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్ స‌త్తా చాటింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఈ ఉత్కంఠ భ‌రిత పోరులో చివ‌ర‌కు విజ‌యం ఢిల్లీనే వ‌రించింది.

దీంతో ప్లే ఆఫ్స్ పై పంజాబ్ పెట్టుకున్న ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది క్యాపిట‌ల్స్. మొద‌ట‌గా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఆదిలోనే త‌డ‌బ‌డింది. ఈ త‌రుణంలో మిచెల్ మార్ష్ (Mitchell Marsh) అద్భుతంగా రాణించాడు.

అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. అటు బ్యాటింగ్ లో త‌క్కువ స్కోర్ కే ప‌రిమిత‌మైనా ప్ర‌త్య‌ర్థి పంజాబ్ ను ప‌రుగులు చేయ‌నీయ‌కుండా క‌ట్ట‌డి చేసింది.

ప్ర‌ధానంగా శార్దూల్ ఠాకూర్ ఢిల్లీకి విజ‌యాన్ని చేకూర్చి పెట్టాడు. కీల‌క‌మైన 4 వికెట్లు తీసి మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక చివ‌రి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ముంబై ఇండియ‌న్స్ తో ఆడ‌నుంది.

ఈ జ‌ట్టుపై విజ‌యం సాధిస్తే నేరుగా క్యాపిట‌ల్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. ఇంకో వైపు ఓట‌మి పాలైన పంజాబ్ కింగ్స్ ఈ ప‌రాజ‌యంతో దాదాపు ఇంటి బాట ప‌ట్టాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

ఇప్ప‌టికే పాయింట్ల ప‌ట్టిక‌లో గుజ‌రాత్ టైటాన్స్ , రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ , ఢిల్లీ క్యాపిట‌ల్స్ , రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు పోటీ ప‌డుతున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క గుజ‌రాత్ మాత్ర‌మే క‌న్ ఫ‌ర్మ్ అయ్యింది. మొత్తంగా స‌మిష్టి ప్ర‌ద‌ర్శ‌న‌తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆక‌ట్టుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 13 మ్యాచ్ లు ఆడి 7 విజ‌యాలు న‌మోదు చేసి 14 పాయింట్లు సాధించింది.

మిషెల్ మార్ష్ 48 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స‌ర్లతో 63 ప‌రుగులు చేసింది. ఇక ఆఖ‌రులో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ 16 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్స‌ర్ తో 32 ర‌న్స్ చేసింది.

Also Read : పంజాబ్ కింగ్స్ కు ఢిల్లీ బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!