IPL Playoffs 2022 : కోట్లాది కళ్లన్నీ ప్లే ఆఫ్స్ పైనే
నిలిచేది ఎవరు గెలిచేది ఎవరు
IPL Playoffs 2022 : గతంలో ఎన్నడూ లేనంతగా ఉత్కంఠ రేపుతోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022. ముంబై వేదికగా జరుగుతున్న
ఈ రిచ్ లీగ్ లో ప్లే ఆఫ్స్ కు ఎవరు చేరుకుంటారనేది టెన్షన్ నెలకొంది.
దాదాపు ఐపీఎల్ పూర్తి అంకానికి చేరుకుంది. ఇప్పటి దాకా 14 సీజన్లు ముగిశాయి. ఇది 15వ రిచ్ లీగ్. గతంలో 8 జట్లు ఆడాయి. ఈసారి రెండు జట్లు కొత్తగా అదనంగా చేరాయి. గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ సత్తా చాటాయ
వచ్చీ రావడంతోనే అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాయి. ఇప్పటి వరకు 10 జట్లలో 5 జట్లు ప్లే ఆఫ్స్(IPL Playoffs 2022) నుంచి దాదాపు తప్పుకున్నట్లే.
గతంలో 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి పాయింట్ల పట్టికలో నెంబర్ 1 పొజిషన్ లో నిలిచింది హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్.
ఆ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ప్లే( ఆఫ్స్(IPL Playoffs 2022) కు చేరుకునేందుకు నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి.
మూడు స్థానాలకు నాలుగు టీమ్ ల మధ్య ఆసక్తికర పోరు కొనసాగనుంది.
ఇక పాయింట్ల వారీగా చూస్తే గుజరాత్ ఇప్పటి దాకా 13 మ్యాచ్ లు ఆడింది. 10 మ్యాచ్ లు గెలుపొంది 3 మ్యాచ్ లలో ఓటమి పాలై 20 పాయింట్లతో టాప్ లో ఉంది.
ఆ జట్టు ఇంకా ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇక సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచ్ లు ఆడింది.
8 మ్యాచ్ లలో విజయం సాధించింది. 5 మ్యాచ్ లలో ఓటమి పాలైంది.
16 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. నెట్ రన్ రేట్ ఆధారంగా సెకండ్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ కూడా సేమ్ పాయింట్లు సాధించినా రన్ రేట్ తక్కువగా ఉండడంతో మూడో స్థానంలో ఉంది.
ఈ జట్టు కూడా ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ , రాయల్ ఛాలెంజర్స్ మధ్య పోటీ నెలకొంది నాలుగో స్థానం కోసం. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 7 మ్యాచ్ లలో గెలుపొందాయి. ఈ జట్ల చేతిలో ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే ఉంది.
Also Read : ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్