PM Modi : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ భారత్ కు ప్రత్యేకం
భారత్, ఫ్రెంచి సంబంధం బలోపేతం
PM Modi : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చాలా విధాలుగా ప్రత్యేకమని స్పష్టం చేశారు. ఇండో – ఫ్రెంచ్ సంబంధాలు అత్యంత బలమైనవని పేర్కొన్నారు మోదీ.
ఇదిలా ఉండగా భారత దేశానికి సంబంధించి ప్రసిద్ద చిత్ర నిర్మాతలలో ఒకరైన సత్యజిత్ రే చిత్రం కేన్స్ క్లాసిక్స్ విభాగంలో ప్రదర్శించనున్నారు.
ఇదే సమయంలో రే శత జయంతి వేడుకులను దేశం జరుపుకుంటోంది. ఈ తరుణంలో ఆయన చిత్రాలను ప్రదర్శించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ప్రధాన మంత్రి మోదీ(PM Modi) .
అంతే కాకుండా ప్రపంచ సినీ రంగానికి సంబంధించి అత్యంత గొప్ప సినీ ఉత్సవాలలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ను భావిస్తారు. 2022లో ఈ చిత్రోత్సవంలో భారత దేశం గౌరవ దేశంగా పాల్గొనడం పట్ల మోదీ మంగళవారం హర్షం వ్యక్తం చేశారు.
ఆయన ఓ ఆత్మీయ సందేశాన్ని ఇచ్చారు. భారత దేశం తన 75వ స్వాతంత్ర ఉత్సవాలు నిర్వహిస్తోంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 75వ వార్షికోత్సవం జరుపుకుంటోంది.
ఈ రెండు పరస్పర అవినాభావ సంబంధాలు కలిగి ఉన్నాయని పేర్కొన్నారు మోదీ(PM Modi). ఇండో ఫ్రెంచ్ దౌత్య సంబంధాలు ముఖ్యమైన మైలు రాళ్లతో ముడి పడి ఉన్న గర్వాన్ని మరింత పెంచుతాయన్నారు.
ప్రపంచంలో అత్యధికంగా సినిమాలను నిర్మిస్తున్నది భారత్ లోనే. వివిధ ప్రాంతాలకు చెందిన అనేక భాషల్లో సినిమాలూ రూపు దిద్దుకుంటున్నాయని తెలిపారు మోదీ.
సినిమాలు , సమాజం ఒకదానికొకటి ప్రతిబింబించే చిత్రాలు. ప్రపంచాన్ని ఒక సాధారణ వినోదంతో కలుపుతుందన్నారు.
Also Read : తమిళ భాషకు అడ్డు పడితే యుద్ధమే