Sanjay Manjrekar : కెప్టెన్సీ భారం ఆటపై ప్రభావం
సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్
Sanjay Manjrekar : భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు ఐపీఎల్ లో కెప్టెన్లుగా వ్యవహరించడం వల్ల ఆటపై ఫోకస్ పెట్టలేక పోతున్నారని సంచలన కామెంట్స్ చేశాడు భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar).
ఇప్పటికే భారత జట్టుకు అన్ని ఫార్మాట్ లకు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా ఉన్నాడు. ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ సార్లు టైటిళ్లు గెలిచినా ఈసారి 2022లో ఆఖరు ప్లేస్ లో నిలిచిందన్నాడు.
ఒక రకంగా వరుస అపజయాలు, పూర్ పర్ ఫార్మెన్స్ రాబోయే ఆటపై కచ్చితంగా ప్రభావం చూపుతుందని పేర్కొన్నాడు మంజ్రేకర్(Sanjay Manjrekar). రోహిత్ తో పాటు శ్రేయస్ అయ్యర్ కేకేఆర్ కు కెప్టెన్ గా ఉండగా మయాంక్ అగర్వాల్ పంజాబ్ కింగ్స్ కు సారథ్యం వహిస్తున్నాడు.
ఇక హార్దిక్ పాండ్యా సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. గతంలో భారత జట్టుకు ఆడిన వారిలో పాండ్యాతో పాటు కేరళ స్టార్ సంజూ శాంసన్ కూడా ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ కు సారథ్యం వహిస్తున్నాడు.
భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ కు , భారత జట్టు వికెట్ కీపర్ గా ఉన్న రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ కు నాయకుడిగా ఉండడం వల్ల అసలైన ఆట తీరును కోల్పోతున్నారని హెచ్చరించారు మంజ్రేకర్.
పేరుకు అంతా అద్భుతమైన ఆటగాళ్లే కానీ అసలైన సమయంలో వీరంతా చేతులు ఎత్తేస్తున్నారంటూ ఎద్దేవా చేశాడు.
Also Read : 23 నుంచి మహిళల టీ20 ఛాలెంజ్