MI vs SRH IPL 2022 : పోరాడి ఓడిన ముంబై గెలిచిన హైద‌రాబాద్

3 ప‌రుగుల తేడాతో అనూహ్య ప‌రాజ‌యం

MI vs SRH IPL 2022 : ఐపీఎల్ 2022లో చివ‌రి ప్లేస్ లో ఉన్న రోహిత్ సేన ఊహించ‌ని రీతిలో గెలుపు అంచుల దాకా వ‌చ్చి బోర్లా ప‌డింది. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో కేవ‌లం 3 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది.

చివ‌రి దాకా ఉత్కంఠ భ‌రితంగా సాగింది. ఆఖ‌రు వ‌ర‌కు న‌రాలు తెగే టెన్ష‌న్ కొన‌సాగింది. ఆఖ‌రుకు గెలుపు స‌న్ రైజర్స్ ను వ‌రించింది. ముంబై ఇండియ‌న్స్ పై గెలిచినా(MI vs SRH IPL 2022)  ప్లే ఆఫ్స్ ఆశ‌లు సంక్లిష్ట‌మే.

మొద‌ట బ్యాటింగ్ చేసిన స‌న్ రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 193 ర‌న్స్ ఏసింది. 194 ప‌రుగుల టార్గెట్ తో మైదానంలోకి దిగిన ముంబై నిర్ణీత

20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 190 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

టిమ్ డేవిడ్ కేవ‌లం 18 బంతులు మాత్ర‌మే ఆడి 3 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో ఉతికి పారేశాడు. డేవిడ్ ఉన్నంత వ‌ర‌కు హైద‌రాబాద్ టెన్ష‌న్ కు లోకైనంది.

అంత‌కు ముందు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 48 ప‌రుగులు చేస్తే ఇషాన్ కిషాన్ 43 ర‌న్స్ తో రాణించారు.

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్(MI vs SRH IPL 2022)  బౌల‌ర్ల‌లో ఉమ్రాన్ మాలిక్ మ‌రోసారి మెరిశాడు. 3 వికెట్లు తీసి స‌త్తా చాటాడు. వాషింగ్ట‌న్ సుంద‌ర్ , భువ‌నేశ్వ‌ర్ కుమార్ చెరో వికెట్ తీశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ భారీ స్కోర్ చేసింది.

కేవ‌లం 6 వికెట్లు కోల్పోయి 193 ప‌రుగులు సాధించింది. రాహుల్ త్రిపాఠి అద్భుతంగా ఆడాడు. 76 ప‌రుగులు చేసి ఇన్నింగ్స్ లో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. అభిషేక్ శ‌ర్మ 42 ప‌రుగులు చేస్తే , నికోల‌స్ పూరన్ 38 ప‌రుగులు చేసి స‌త్తా చాటాడు.

ముంబై బౌల‌ర్ల‌లో ర‌మ‌న్ దీప్ 3 వికెట్లు ప‌డ‌గొడితే , బుమ్రా, మెరిడిత్ , డేనియ‌ల్ సామ్స్ చెరో వికెట్ తీశారు.

Also Read : కెప్టెన్సీ భారం ఆట‌పై ప్ర‌భావం

Leave A Reply

Your Email Id will not be published!