Umran Malik : మరోసారి మెరిసిన ఉమ్రాన్ మాలిక్
ముంబై ఇండియన్స్ కు చుక్కలు
Umran Malik : ఐపీఎల్ 2022లో మోస్ట్ పాపులర్ స్టార్ బౌలర్ గా పేరొందాడు జమ్మూ కాశ్మీర్ కు చెందిన మారథాన్ ఎక్స్ ప్రెస్ ఉమ్రాన్ మాలిక్. మనోడి వేగవంతమైన బంతులకు ఆడాలంటే బ్యాటర్లు జడుసుకుంటున్నారు.
ఇక ప్రతి ఏటా జరిగే ఐపీఎల్ లో బ్యాటర్లలో అత్యధిక పరుగులు చేసి టాప్ లో నిలిచిన బ్యాటర్ కు ఆరెంజ్ క్యాప్ అందజేస్తారు. బ్యాటర్ తో పాటు అత్యధిక వికెట్లు తీసి నెంబర్ వన్ లో నిలిచిన బౌలర్ కు పర్పుల్ క్యాప్ ఇస్తారు.
భారీ క్యాష్ కూడా అందుతుంది. ఈసారి ఐపీఎల్ లో అనూహ్యంగా తెర మీదకు వచ్చాడు ఉమ్రాన్ మాలిక్ . మిస్సైల్స్ లాంటి బాల్స్ తో పరేషాన్ చేస్తూ వికెట్లు తీస్తున్నాడు.
ఇదిలా ఉండగా తమ దేశంలో గనుక పుట్టి ఉంటే ఎప్పుడో జాతీయ జట్టుకు ఉమ్రాన్ మాలిక్(Umran Malik) ఎంపికయ్యే వాడంటూ సంచలన కామెంట్స్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్.
ఇక భారత జట్టుకు చెందిన తాజా, మాజీ ఆటగాళ్లు సైతం మాలిక్ బౌలింగ్ ను మెచ్చుకుంటున్నారు. పనిలో పనిగా ఎవరూ ఊహించని రీతిలో పొలిటికల్ లీటర్లు సైతం ఉమ్రాన్ మాలిక్(Umran Malik) ను జాతీయ జట్టులోకి తీసుకోవాలని కోరుతుండడం విస్తు పోయేలా చేసింది.
ఇలా కోరిన వారిలో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ శశి థరూర్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నారు.
కాగా ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో భాగంగా ముంబై వేదికగా ముంబై ఇండియన్స తో జరిగిన కీలక మ్యాచ్ లో ఉమ్రాన్ మాలిక్ సత్తా చాటాడు. కీలకమైన మూడు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Also Read : వారెవ్వా ప్రియమ్ గార్గ్ అదుర్స్