SRH Playoffs : ప్లే ఆఫ్స్ కు స‌న్ రైజ‌ర్స్ క‌ష్టం

ఇత‌ర జ‌ట్లు ఓడి పోవాలి

SRH Playoffs : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022 రిచ్ టోర్నీ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. దాదాపు 90 శాతం మ్యాచ్ లు పూర్త‌య్యాయి. ఇక 10 శాతం మ్యాచ్ లు కొన‌సాగాల్సి ఉంది.

ఈనెల 29న ఐపీఎల్ ముగుస్తుంది. ఈసారి 15వ సీజ‌న్ లో 10 జ‌ట్లు పాల్గొన్నాయి. కొత్త‌గా చేరిన గుజ‌రాత్ టైటాన్స్ , ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ స‌త్తా చాటాయి.

కీల‌క స‌మ‌యంలో త‌మ అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాయి. అస‌లైన పోరు కోసం పోటీ ప‌డుతున్నాయి. టోర్నీలో కీల‌కం ప్లే ఆఫ్స్ . నాలుగు జ‌ట్లు ఆడ‌తాయి. వీటిలో గెలిచిన త‌ర్వాత ఫైన‌ల్ కోసం పోటీ జ‌రుగుతుంది.

గుజ‌రాత్ 10 మ్యాచ్ లు గెలుపొంది 20 పాయింట్స్ సాధించి టాప్ లో ఉంది. ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉంది. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ మెరుగైన

ర‌న్ రేట్ తో 8 గెలిచి 16 పాయింట్ల‌తో ఉంది.

ఇక ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ 13 మ్యాచ్ లు ఆడి 8 విజ‌యం సాధించి 5 మ్యాచ్ ల‌లో ఓడి పోయింది. రాజ‌స్తాన్, ల‌క్నో జ‌ట్లు స‌రి స‌మానంగా

గెలుపొందినా నెట్ ర‌న్ రేట్ విష‌యంలో రాజ‌స్థాన్ ముందంజ‌లో ఉంది.

ఈ ఇరు జ‌ట్లు ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఏదో అద్భుతం జ‌రిగితే త‌ప్ప గుజ‌రాత్, ల‌క్నో, రాజ‌స్థాన్ జ‌ట్ల‌లో మార్పు జ‌రిగే చాన్స లేదు.

ఇక ఒకే ఒక్క నాలుగో స్థానం కోస‌మే పెద్ద ఎత్తున పోటీ నెల‌కొంది.

ఈ ఒక్క స్థానం కోసం ఇప్పుడు ఢిల్లీ క్యాపిట‌ల్స్ ,రాయ‌ల్స్ ఛాలెంజ‌ర్స బెంగ‌ళూరు, కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ , పంజాబ్ కింగ్స్ పోటీ ప‌డుతున్నాయి.

ఇక లీగ్ లో ముంబై పై గెలిచినా స‌న్ రైజ‌ర్స్ ప్లే ఆఫ్స్(SRH Playoffs)  కు చేరుకోవ‌డం క‌ష్ట‌మ‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. ఇత‌ర జ‌ట్లు ఓడి పోవాలి.

ఈ జ‌ట్టు పంజాబ్ కింగ్స్ తో భారీ తేడాతో విజ‌యం సాధించాలి.

Also Read : మ‌రోసారి మెరిసిన ఉమ్రాన్ మాలిక్

Leave A Reply

Your Email Id will not be published!