Shaktisinh Gohil : హార్దిక్ స్వరం బీజేపీ రాగం
కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఫైర్
Shaktisinh Gohil : రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన హార్దిక్ పటేల్ పై కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. అవసరం ఉన్న సమయంలో పార్టీ గుర్తుకు వచ్చిందని, అది తీరాక ఇప్పుడు విమర్శించడం తప్పు కాదా అని ప్రశ్నించింది.
ఇవాళ తాను రాజీనామా చేస్తూ చేసిన ఆరోపణలు పటేల్ నుంచి రాలేదని , ఆయన ద్వారా భారతీయ జనతా పార్టీ పరకాయ ప్రవేశం చేసి తమపై బురద చల్లిందంటూ మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ శక్తి సిన్హ్ గోహిల్.
హార్దిక్ పటేల్ రాజస్థాన్ రాష్ట్రంలో బలమైన పటిదార్ వర్గానికి నాయకుడిగా ఉన్నారు. అత్యధిక ఓటు బ్యాంకు కలిగి ఉంది. సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీపై.
ఓ వైపు రాష్ట్రంలో ప్రజలు ఇబ్బదులు పడుతుంటే నాయకులు విదేశాల్లో పర్యటిస్తున్నారంటూ ఆరోపించారు. తాను ఎన్నిసార్లు హైకమాండ్ కు ఫిర్యాదు చేసినా పట్టించు కోలేదన్నారు.
చికెన్, శాండ్ విచ్ లు అందించడంలో ఉన్నంత శ్రద్ద రాష్ట్రంపై, ప్రజలపై లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. హార్దిక్ పటేల్ కృతజ్ఞత తెలుపాల్సింది పోయి పార్టీపై అనవసర ఆరోపణలు చేయడం దారుణమని పేర్కొన్నారు ఎంపీ.
కాంగ్రెస్ వాదిగా మాట్లాడడం లేదని, హార్దిక్ పటేల్ ఫక్తు భారతీయ జనతా పార్టీ చెప్పినట్లుగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. సత్యం వైపు నిలబడే వారు భావజాలంతో నిలబడారంటూ యూత్ కాంగ్రెస్ చీఫ్ శ్రీనివాస్ బివి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
కొన్ని రోజుల కిందట రాహుల్ గాంధీతో వేదిక పంచుకున్నారు. మిమ్మల్ని ఎవరు కలవకుండా అడ్డుకున్నారంటూ హార్దిక్ పటేల్ ను ప్రశ్నించారు ఎంపీ. ఇది పూర్తిగా పార్టీకి వెన్నుపోటు పొడవడం తప్ప మరొకటి కాదన్నారు.
Also Read : ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్ మంజూరు