KKR vs LSG IPL 2022 : విరోచిత పోరాటం ల‌క్నోదే విజ‌యం

2 ప‌రుగుల తేడాతో కోల్ క‌తా అప‌జ‌యం

KKR vs LSG IPL 2022 : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022 లో అత్యంత ఉత్కంఠ భరిత‌మైన గేమ్ ఇది. అస‌లు టీ20 లో ఉన్న

మ‌జా ఏమిటో మ‌రోసారి తెలిసేలా చేసింది ఈ లీగ్ మ్యాచ్.

ఒక ర‌కంగా చెప్పాలంటే ల‌క్నో సూప‌ర్ జెయింట్స్(KKR vs LSG IPL 2022) విజ‌యం సాధించినా క్రీడాభిమానుల మ‌నసులు మాత్రం కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ గెలుచుకుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ప్లే ఆఫ్స్ కు చేరుకునేందుకు జ‌రిగిన అతి ముఖ్య‌మైన మ్యాచ్ చివ‌రి బంతి దాకా నువ్వా నేనా అన్న రీతిలో పోరు కొన‌సాగింది.

ఆద్యంత‌మూ అద్భుత‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించాయి ఇరు జ‌ట్లు. ల‌క్నో అద్భుత‌మైన స్కోర్ చేస్తే దానిని అందుకునేందుకు అత్యద్భుతంగా

ఆడింది కోల్ క‌తా.

ఈ మొత్తం రిచ్ లీగ్ లో ఈ మ్యాచ్ క‌ల‌కాలం గుర్తుండి పోతుంది. క్వింట‌న్ డికాక్ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ , రెచ్చి పోయిన రాహుల్ తో భారీ స్కోర్ చేస్తే ఆ త‌ర్వాత బ‌రిలోకి దిగిన కోల్ కా తానేమీ త‌క్కువ కాదంటూ దుమ్ము రేపింది.

నితీష్ రాణా, శ్రేయ‌స్ అయ్య‌ర్, రింకూ సింగ్ , సామ్ బిల్లింగ్స్ చివ‌రి దాకా సాగించిన పోరు అద్భుత‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ మ్యాచ్ లో ఇరు

జ‌ట్లు భారీ స్కోర్లు న‌మోదు చేశాయి. అన్నీ ఫోర్లు, సిక్స‌ర్లే. మైదానం బ్యాట‌ర్ల విధ్వంసంతో నిండి పోయింది.

చివరి బంతి దాకా స‌స్పెన్స్ కొన‌సాగింది. చివ‌రికి ల‌క్నో 2 ప‌రుగుల తేడాతో గెలుపొంది ద‌ర్జాగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ల‌క్నో కెప్టెన్ టాస్

గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వికెట్ న‌ష్ట పోకుండా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 210 ప‌రుగులు చేశారు.

ఓపెనింగ్ భాగస్వామ్యంలో ఇదే అత్యుత్త‌మ స్కోర్ కావ‌డం విశేషం. క్వింట‌న్ డికాక్ 70 బంతులు ఆడాడు. 140 ప‌రుగులు చేసి నాటౌట్ గా

నిలిచాడు. ఇందులో 10 ఫోర్లు 10 సిక్స‌ర్లు ఉన్నాయి.

కేఎల్ రాహుల్ 51 బంతులు ఆడి 5 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో 68 ర‌న్స్ చేశాడు. అనంత‌రం కోల్ క‌తా(KKR vs LSG IPL 2022) 8 వికెట్లు

కోల్పోయి 208 ర‌న్స్ చేసింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ 29 బంతులు ఆడి 4 ఫోర్లు 3 సిక్స్ ల‌తో 5 ర‌న్స్ చేశాడు.

నితీష్ రాణా 22 బంతులు ఆడి 9 ఫోర్ల‌తో 42 ప‌రుగులు చేస్తే రింకూ సింగ్ 15 బంతులు ఆడి 2 ఫోర్లు 4 సిక్స్ ల‌తో 40 ప‌రుగులు చేశాడు. సామ్ బిల్లింగ్స్ 24 బంతులు ఆడి 2 ఫోర్లు 3 సిక్స్ ల‌తో 36 ర‌న్స్ చేశాడు.

 

Also Read : దంచి కొట్టిన డికాక్ రెచ్చి పోయిన రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!