Rinku Singh : దంచి కొట్టిన రింకూ సింగ్
లక్నోకు చుక్కలు చూపించాడు
Rinku Singh : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) 2022లో లక్నోతో జరిగిన కీలక పోరులో కేవలం 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది కోల్ కతా నైట్ రైడర్స్. ఆద్యంతమూ నువ్వా నేనా అన్న రీతిలో సాగింది ఈ మ్యాచ్. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 210 పరుగులు చేసింది.
క్వింటన్ డికాక్ 140 రన్స్ చేస్తే కెప్టెన్ కేఎల్ రాహుల్ 68 పరుగులతో రాణించారు. వికెట్ నష్ట పోకుండా మొదటి వికెట్ కు భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఐపీఎల్ లో చరిత్ర సృష్టించారు.
అనంతరం బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించింది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినా ఎక్కడా చెక్కు చెదరకుండా దుమ్ము రేపింది.
ప్రధానంగా నితీష్ రాణా లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడికి తోడుగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రఫ్పాడించాడు.
ప్రధానంగా సిక్స్ లు, ఫోర్లతోనే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు వీరిద్దరూ. సిక్స్ కొట్ట బోయి వెనుదిరిగాడు అయ్యర్. ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన రింకూ సింగ్ (Rinku Singh)విధ్వంసం అంటే ఏమిటో చూపించాడు లక్నోకు.
ఓ వైపు డికాక్ ను మరిపించేలా ఆడాడు. కేవలం 15 బంతులు మాత్రమే ఆడిన రింకూ(Rinku Singh) 2 ఫోర్లు 4 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 40 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడిన తరుణంలో ఔట్ కావడంతో కేకేఆర్ ఓటమి పాలైంది.
ఒక వేళ ఇంకా 10 నిమిషాల సేపు క్రీజులో ఉంటే సీన్ వేరేగా ఉండేది. లక్నో తప్పక గెలిచి ఉండేది.
Also Read : దంచి కొట్టిన డికాక్ రెచ్చి పోయిన రాహుల్