Shreyas Iyer : పోరాడాం అయినా ఓడి పోయాం
బాధ పడటం లేదన్న అయ్యర్
Shreyas Iyer : ఐపీఎల్ 2022 టోర్నీ నుంచి కోల్ కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ కు చేరకుండానే ఎలిమినేట్ అయ్యింది. లక్నోతో జరిగిన ప్రధాన పోటీలో విజయం అంచుల దాకా వచ్చి కేవలం 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
నితీశ్ రాణా, శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్ , సామ్ బిల్లింగ్స్ అద్భుతంగా ఆడారు. చివరి దాకా వచ్చారు. కానీ అనుకోని రీతిలో పరాజయం కావడంపై స్పందించాడు కోల్ కతా నైట్ రైడర్స్ స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer).
తాను ఆడిన అత్యుత్తమ మ్యాచ్ లలో ఇది ఒకటి అని పేర్కొన్నాడు. ఏది ఏమైనా తాము ఓడి పోయినందుకు బాధ పడడం లేదన్నాడు. ఎందుకంటే తాము ప్రత్యర్థి జట్టు కంటే బాగా ఆడాం.
కానీ చివరి క్షణంలో రింకూ సింగ్ వెనుదిరగడం తమను దెబ్బ తీసిందన్నాడు అయ్యర్. జట్టు సభ్యులంతా కలిసికట్టుగా అద్భుతంగా ఆడారని కితాబు ఇచ్చాడు. రింకూ సింగ్ చివరి దాకా గెలిపించేందుకు నానా తంటాలు పడ్డాడు.
కానీ ఆఖరులో క్యాచ్ ఇవ్వడంతో ఉద్వేగానికి లోనయ్యాడని తెలిపాడు. రింకూ సింగ్ బెస్ట్ ఫినిషర్ గా ఉంటాడని అనుకున్నానని కానీ చివర్లో ఔట్ కావడం బాధ కలిగించిందన్నాడు.
మొత్తంగా తమ జట్టు ఆట తీరు పట్ల సంతోషంగా ఉందన్నాడు శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer). చివరి వరకూ లక్నో ఆశలు వదులుకుంది.
కానీ మార్కస్ మమ్మల్ని ఇబ్బంది పెట్టాడని అతడు కొట్టిన దెబ్బ తమను ఓడి పోయేలా చేసిందన్నాడు అయ్యర్. సీజన్ లో ముందు బాగా ఆడాం. కానీ గాయాల కారణంగా ఓడి పోవడం బాధకు గురి చేసిందన్నాడు.
Also Read : వీడు మామూలోడు కాదు మగాడు