Sunil Jakhar : కాంగ్రెస్ కోట‌రీ కాద‌ది ఓ ముఠా

కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖ‌ర్

Sunil Jakhar : న‌న్ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించ‌గ‌ల‌రు. కానీ నా గొంతును మూయ‌లేర‌ని అన్నారు కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జాఖ‌ర్. ఆయ‌న గురువారం కాషాయం కండువా క‌ప్పుకున్నారు.

అనంత‌రం బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డాతో క‌లిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ కోట‌రీ ఓ ముఠాగా మారింద‌ని ఆరోపించారు. నన్ను బ‌ర్త‌ర‌ఫ్ చేశామ‌ని వాళ్లు ఆనందంలో ఉన్నారు.

కానీ వారికి అర్థం కానిది ఏమిటంటే త‌న‌ను ముట్టు కోవ‌డం అంటే పులితో గోక్కోవ‌డ‌మేన‌ని పేర్కొన్నారు. ఆయ‌న సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ తో అనుబంధం క‌లిగి ఉన్నారు. దానితో తెగ తెంపులు చేసుకోవ‌డం ప‌ట్ల విచారం వ్య‌క్తం చేశారు.

పంజాబ్ ను ప‌ర్సంటేజీల్లో చూడ‌లేర‌ని, కులాల వారీగా ప్ర‌జ‌ల‌ను విభ‌జించ‌డం సాధ్యం కాద‌ని తాను ఎత్తి చూపాన‌ని అందుకే త‌న‌పై క‌క్ష క‌ట్టారంటూ మండిప‌డ్డారు సునీల్ జాఖ‌ర్. నన్ను బ‌హిష్క‌రించ గ‌ల‌రు,

వెలి వేయ‌గ‌ల‌రు కానీ నా గొంతును, నేను ప్ర‌శ్నించే ప్ర‌శ్న‌ల‌ను ఎలా మూస్తారంటూ నిల‌దీశారు. నాకు కాంగ్రెస్ పార్టీతో 50 ఏళ్ల అనుబంధం ఉంది. 1972 నుంచి మా కుటుంబం త‌రాలుగా పార్టీతో ఉంది.

నేను దానిని నా కుటుంబం కంటే ఎక్కువ‌గా భావించాన‌ని చెప్పారు. చాలా మంది అసంతృప్త నేత‌ల‌తో ఆయ‌న‌కు ప‌ట్టుంది. ఇదిలా ఉండ‌గా సునీల్ జాఖ‌ర్(Sunil Jakhar) ను రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేయొచ్చ‌ని, పంజాబ్ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఏది ఏమైనా మ‌రో సీనియ‌ర్ నేతను కోల్పోవ‌డం కాంగ్రెస్ కు పెద్ద దెబ్బేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : కాంగ్రెస్ కాదది ‘రాహుల్..ప్రియాంక’ పార్టీ

Leave A Reply

Your Email Id will not be published!