Mohammad Azaharuddin : ఇరానీ చాయ్ అజ్జూ భాయ్

టీ అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం

Mohammad Azaharuddin : మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్. ఈ పేరును ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. ఎందుకంటే ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్ర‌లో అత్యంత ఆద‌ర‌ణ పొందిన భార‌తీయ క్రికెట‌ర్ల‌లో టాప్ లో ఉన్న ఏకైక ప్లేయ‌ర్.

మోస్ట్ పాపుల‌ర్. ప‌క్కా హైద‌రాబాదీ. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ కు చీఫ్ గా ఉన్నాడు. ఒక‌ప్పుడు గ‌ల్లీలో ఆడిన ఈ బ‌క్క ప‌ల్చ‌ని హైద‌రాబాదీ భార‌త దేశ క్రికెట్ కు కొత్త సొబ‌గులు అద్దాడు.

వ‌చ్చీ రావ‌డంతోనే వ‌రుస‌గా మూడు సెంచ‌రీలు సాధించి అద్భుత చ‌రిత్ర‌కు శ్రీ‌కారం చుట్టాడు. బ్యాట‌ర్ గా, ఫీల్డ‌ర్ గా, కెప్టెన్ గా అత‌డు స‌క్సెస్ ఫుల్ క్రికెట‌ర్ గా నిలిచాడు.

వ్య‌క్తిగ‌తంగా కొన్ని లోపాలు ఉన్న‌ప్ప‌టికీ అజ‌హ‌రుద్దీన్ అనే పేరు తల్చుకునేలా చేశాడు ఈ మ‌ణిక‌ట్టు మాంత్రికుడు. ఇప్ప‌టి వ‌ర‌కు రిస్టీ ప్లేయ‌ర్లుగా త‌యారు కాలేదు. వంద‌లాది క్రికెట‌ర్లు వ‌స్తున్నారు.

ఆడుతున్నారు. కానీ అజ‌హ‌రుద్దీన్ (Mohammad Azaharuddin) లాగా ఆడేందుకు ప్ర‌య‌త్నం చేసినా స‌క్సెస్ కాలేక పోయారు. హైద‌రాబాద్ నుంచి ఎంతో మంది ఆట‌గాళ్లు భార‌త జ‌ట్టుకు ఆడారు.

కానీ అజ‌హ‌రుద్దీన్ లాగా ఆడిన వాళ్లు లేరు. చ‌రిత్ర‌ను సృష్టించిన వాళ్లు లేరు. భార‌త క్రికెట్ జ‌ట్టుపై బాంబే ఆధిప‌త్యానికి తెర దించాడు మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్. ఎన‌లేని విజ‌యాలు చేకూర్చి పెట్టాడు.

ఎంతో మందికి లైఫ్ ఇచ్చాడు. అత‌డి సార‌థ్యంలోనే ప‌లువురు ఆట‌గాళ్లు అద్బుత‌మైన ఆట తీరును క‌న‌బ‌ర్చారు. వారిలో ప్ర‌స్తుతం బీసీసీఐకి బాస్ గా ఉన్న సౌరవ్ గంగూలీ. ఎన్నో ఎత్తు ప‌ల్లాలు ఉన్నాయి.

అన్నింటిని త‌ట్టుకుని నిల‌బ‌డ్డాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయిన‌ర్ గా ఉన్నాడు. ఏది ఏమైనా హైద‌రాబాద్ అంటేనే ఇరానీ చాయ్ గుర్తుకు వ‌స్తుంది అంతే కాదు అజ్జూ భాయ్ కూడా గుర్తుండి పోతాడు. ఇవాళ టీ దినోత్స‌వం క‌దూ అందుకే ఈ రేర్ ఫోటో.

Also Read : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ సింబ‌ల్ టీ గ్లాసు

Leave A Reply

Your Email Id will not be published!