Rishabh Pant : కొంప ముంచిన బాధ్యాతా రాహిత్యం

ఢిల్లీ ఓట‌మికి కార‌ణం రిష‌బ్ పంత్

Rishabh Pant : ప్ర‌పంచ క్రికెట్ దిగ్గ‌జాల‌లో పేరొందిన వారిలో ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ రికీ పాంటింగ్. ఆపై షేన్ వాట్స‌న్ కూడా ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు సేవ‌లు అందిస్తున్నాడు.

హెడ్ కోచ్ గా ఉన్న పాంటింగ్ , కెప్టెన్ గా ఉన్న రిష‌బ్ పంత్(Rishabh Pant)  మ‌ధ్య స‌మ‌న్వ‌యం పూర్తిగా కొర‌వ‌డింద‌న్న‌ది ముంబై ఇండియ‌న్స్ తో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో తేలి పోయింది.

ఒకానొక ద‌శ‌లో ఢిల్లీ చేతిలోనే ఉంది 16 ఓవ‌ర్ల వ‌ర‌కు. కానీ వ‌చ్చీ రావ‌డంతోనే టిమ్ డేవిడ్ శివ‌మెత్తాడు. ఊగి పోయాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించాడు. అంతే కాదు భారీ సిక్స‌ర్ల తో మోత మోగించాడు.

కేవ‌లం టిమ్ డేవిడ్ ఆడింది ప‌ట్టుమ‌ని 11 బంతులు మాత్ర‌మే. ఇందులో 2 ఫోర్లు 4 సిక్స‌ర్లు ఉన్నాయి. బంతులు త‌క్కువ ర‌న్స్ భారీగా చేయాల్సిన స‌మ‌యంలో డేవిడ్ దానిని పూర్తిగా త‌గ్గించేశాడు.

విజ‌యానికి ద‌గ్గ‌ర‌గా చేర్చాడు. ఒకానొక స‌మ‌యంలో బ్యాట్ కు బంతి త‌గిన‌ట్లు అనిపించింది. ఈ కీల‌క స‌మ‌యంలో కెప్టెన్ రిష‌బ్ పంత్ డీఆర్ఎస్ తీసుకోవాల్సి ఉంది.

ఈ విష‌యాన్ని జ‌ట్టు ఆట‌గాళ్లు సైతం కెప్టెన్ కు సూచించినా ప‌ట్టించు కోలేదు. మ‌రో వైపు జైస్వాల్ విష‌యంలో లెగ్ బిఫోర్ వికెట్ కాద‌ని తెలిసినా డీఆర్ఎస్ తీసుకున్నాడు.

ఇక ఆఖ‌రు ఓవ‌ర్ లో 6 బంతులు 5 ప‌రుగులు కావాలి. కానీ ఖ‌లీల్ అహ్మ‌ద్ కు ఇచ్చాడు. మ‌నోడు నో బాల్ వేశాడు. దానిని ఫోర్ కొట్టాడు. 3 బంతులు ఒక ప‌రుగు. చివ‌ర‌కు వైడ్ వేయ‌డంతో ముంబై ఇండియ‌న్స్ జ‌య‌కేత‌నం ఎగుర వేసింది.

పేల‌వ‌మైన బ్యాటింగ్, నిరాశ ప‌ర్చిన ఫీల్డింగ్, కీల‌క స‌మ‌యంలో రాణించ‌ని స్టార్ ఆట‌గాళ్లతో పాటు కెప్టెన్ బాధ్య‌తా రాహిత్యం ఢిల్లీ క్యాపిట‌ల్స్ కొంప ముంచింది. చేజేతులా ఓడి పోయేలా చేసింది.

Also Read : చేజేతులా ఓడిన ఢిల్లీ క్యాపిట‌ల్స్

Leave A Reply

Your Email Id will not be published!