Jos Butler IPL 2022 : బట్లర్ ను ఊరిస్తున్న ఆరెంజ్ క్యాప్
రెండో ప్లేస్ లో లక్నో కెప్టెన్ రాహుల్
Jos Butler IPL 2022 : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) 2022 ఆఖరి అంకానికి చేరింది. నాలుగు జట్లు ప్లే ఆఫ్స్ కు చేరాయి. ఇక రిచ్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించే బ్యాటర్ కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ అవార్డు రేసులో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్(Jos Butler IPL 2022) టాప్ లో నిలిచాడు.
ఇంకా ఆ జట్టు రెండు లేదా మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇక ఈ టోర్నీలో పరుగుల వీరులు చాలా మంది ఉన్నారు. కానీ ప్రధాన పోటీ మాత్రం బట్లర్ వర్సెస్ రాహుల్ మధ్య నెలకొంది.
ఈసారి సీజన్ లో దుమ్ము రేపిన వారిలో యువ ఆటగాళ్లు ఉండడం విశేషం. గుజరాత్ టైటాన్స్ తరపున శుభ్ మన్ గిల్ 14 మ్యాచ్ లు ఆడి
403 రన్స్ చేసి సత్తా చాటాడు. ఇక జోస్ బట్లర్(Jos Butler IPL 2022) 14 మ్యాచ్ లు ఆడి 629 పరుగులు చేసి నెంబర్ వన్ లో నిలిచాడు.
రెండో స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఉన్నాడు. 14 మ్యాచ్ లు ఆడి 537 పరుగులు చేశాడు. ఆర్సీబీ కెప్టెన్ ప్లాఫ్
డుప్లెసిస్ 14 మ్యాచ్ లు ఆడి 443 రన్స్ చేశాడు.
అనూహ్యంగా అవమానానికి గురై సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి నిష్క్రమించిన స్టార్ హిట్టర్ ఆసిస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ 12 మ్యాచ్ లు
ఆడి 432 రన్స్ చేశాడు. కోల్ కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 14 మ్యాచ్ లు ఆడి 401 రన్స్ చేశాడు.
శిఖర్ ధావన్ 13 మ్యాచ్ లు ఆడి 421 రన్స్ చేశాడు. (ఆదివారం హైదరాబాద్ తో ఆడాల్సి ఉంది). సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి రాహుల్ త్రిపాఠి 393 పరుగులు చేసి సత్తా చాటాడు.
సీఎస్కే నుంచి రుతురాజ్ గైక్వాడ్ 14 మ్యాచ్ లు ఆడి 368 రన్స్ చేశాడు. తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ 14 మ్యాచ్ లు ఆడి 397
పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.
Also Read : చరిత్ర సృష్టించిన తెలంగాణ తేజం