TSCHE JOBS : బోధనేతర పోస్టుల భర్తీకి ఛాన్స్
యూనివర్శిటీలలో ఖాళీలు ఇవే
TSCHE JOBS : అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన మేరకు మెల మెల్లగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇప్పటికే టీఎస్పీఎస్సీ డిక్లేర్ చేసింది. పోలీసు, రవాణా శాఖ తో పాటు తెలంగాణ విద్యుత్ సంస్థ కూడా నోటిఫికేషన్లు ఇచ్చాయి.
తాజాగా అందిన సమాచారం మేరకు రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ (బోధనేతర) పోస్టుల (TSCHE JOBS) భర్తీకి పచ్చ జెండా ఊపింది తెలంగాణ ఉన్నత విద్యా మండలి.
ఈ మేరకు సీఎం ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆయా యూనివర్శిటీలకు కలిపి మొత్తం 2, 774 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. విచిత్రం ఏమిటంటే 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్శిటీలో 2,075 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఇతర విభాగాలలో భర్తీ చేయనున్నారు. ఒక్క ఓయూలోనే 680 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు(TSCHE JOBS) ఉన్నట్లు అంచనా. ఇక పోస్టుల వారీగా చూస్తే ఉస్మానియాలో 3,209 పోస్టులు మంజూరైతే 1,134 పని చేస్తున్నారు.
ఇంకా 2075 భర్తీ కావాల్సి ఉంది. కాకతీయలో 174, తెలంగాణలో 9 , మహాత్మా గాంధీలో 9 , శాతవాహన యూనివర్శిటీలో 58 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.
ఇక పాలమూరు యూనివర్శిటీలో 14, పీఎస్టీయూ లో 84, బీఆర్ఏఓయూలో 90, జేఎన్టీయూహెచ్ లో 115, ఆర్జీయూ కేటీలో 93 ఖాళీగా ఉన్నాయి.
మొత్తం యూనివర్శిటీలలో కలిపి 2 వేల 774 పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు దాని ఊసే లేదు. ఒకే నోటిఫికేషన్ ఇస్తుందా లేక వేర్వేరుగా ఇస్తుందా అన్నది స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉన్నత విద్యా మండలిపై ఉంది.
Also Read : హమ్మయ్య నోటిఫికేషన్ విడుదల