PBKS vs SRH IPL 2022 : హైదరాబాద్ కు షాక్ పంజాబ్ విక్టరీ
ఐపీఎల్ 2022లో ముగిసిన ఆఖరి లీగ్ మ్యాచ్
PBKS vs SRH IPL 2022 : గత కొన్ని రోజులుగా అలరిస్తూ వస్తున్న ఐపీఎల్ 2022 లో ఆఖరి లీగ్ మ్యాచ్ ముగిసింది. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ 74వది. ఇప్పటికే నాలుగు జట్లు ప్లే ఆఫ్స్ కు చేరాయి.
గుజరాత్ టైటాన్స్ , రాజస్థాన్ రాయల్స్ , లక్నో సూపర్ జెయింట్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉన్నాయి. ఈ మొత్తం రిచ్ మెగా టోర్నీలో లక్ అంటే ఆర్సీబీదే. ముంబై చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలవడంతో బెంగళూరు జాక్ పాట్ కొట్టింది.
దీంతో కోహ్లీ పరివారం సంబురాల్లో మునిగి పోయింది. ఇక నామమత్రంగా జరిగిన పోరులో సన్ రైజర్స్ ఆట తీరులో ఎలాంటి మార్పు రాలేదు. టోర్నీ మొదట్లో దుమ్ము రేపినా ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ చతికిల పడింది.
ఈ జట్టులో జమ్మూ కాశ్మీర్ ఉమ్రాన్ మాలిక్ ను జాతీయ జట్టుకు ఎంపిక చేయడం ఒక్కటే ఆ జట్టుకు కాస్తా ఊరటను కలిగించే అంశం.
ఇక కెప్టెన్ గా ఉన్న కేన్ విలియమ్సన్ స్వదేశానికి వెళ్లి పోయాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే భువనేశ్వర్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అభిషేక్ వర్మ తప్ప ఎవరూ సత్తా చాటలేక పోయారు. 14 మ్యాచ్ లు
ఆడిన ఈ జట్టు 6 విజయాలతో మాత్రమే సరి పెట్టుకుంది.
ఇంటి బాట పట్టింది. 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్(PBKS vs SRH IPL 2022) నిర్ణీత 20 ఓవర్లలో
8 వికెట్లు కోల్పోయి 157 రన్స్ చేసింది. అభిషేక్ వర్మ 43 రన్స్ చేస్తే షెఫర్డ్ 20 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు.
వాషింగ్టన్ సుందర్ 25 , రాహుల్ త్రిపాఠి 20, మార్క్మ్ 21 రన్స్ చేసి రాణించారు. అనంతరం బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్
15.1 ఓవర్లలోనే కథ ముగించింది. 5 వికెట్లు కోల్పోయి 160 రన్స్ చేసింది.
లివింగ్ స్టోన్ 22 బంతులు ఆడి 49 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. శిఖర్ ధావన్ 39 పరుగులు చేశాడు.
Also Read : చుక్కలు చూపించిన లివింగ్ స్టోన్