Umran Malik : కశ్మీర్ ఎక్స్ ప్రెస్ కు భలే ఛాన్స్
ఉమ్రాన్ మాలిక్ కు టీ20లో ఎంపిక
Umran Malik : ఈసారి ఇండియన్ ప్రిమీయర్ లీగ్ 2022లో మోస్ట్ పాపులర్ బౌలర్ గా పేరొందాడు జమ్మూ కశ్మీర్ కు చెందిన సూపర్ ఫాస్ట్ పేసర్ , కశ్మీర్ ఎక్స్ ప్రెస్ గా పేరొందిన ఉమ్రాన్ మాలిక్(Umran Malik). ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు.
ఏకంగా గంటకు 157 కిమీమీటర్ల వేగంతో బంతులు వేసి చరిత్ర సృష్టించాడు. బ్యాటర్లు ఒకానొక దశలో షాట్స్ ఆడడం కంటే డిఫెన్స్ ఆడేందుకే మొగ్గు చూపారు. అంటే అర్థం చేసుకోవచ్చు.
అతడు ఎంతటి ప్రమాదకరమైన బౌలింగ్ చేశాడో. అతడి ప్రతిభా పాటవాలకు తాజా, మాజీ క్రీడాకారులే కాదు పొలిటికల్ లీడర్లు సైతం జాతీయ జట్టుకు తీసుకోవాలని కోరారు.
అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలెక్షన్ కమిటీ చైర్మన్ , మాజీ ఫేసర్ చేతన్ శర్మ
ఉమ్రాన్ మాలిక్ ను దక్షిణాఫ్రికాతో జరిగే జట్టుకు ఉమ్రాన్ మాలిక్ కు చోటు కల్పించాడు.
ఇక ఐపీఎల్ లో డెత్ ఓవర్స్ లో తన అద్భుతమైన యార్కర్లతో ఆకట్టుకున్న అర్ష్ దీప్ కు కూడా ఛాన్స్ దక్కింది. ఇక ప్రధానంగా కేంద్ర
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు పి. చిదంబరం, కేరళ రాజ్యసభ ఎంపీ శశి థరూర్,
తెలంగాణ ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ తో పాటు సునీల్ గవాస్కర్ , పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు సైతం ఉమ్రాన్ మాలిక్ ను జాతీయ
జట్టుకు ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.
మొత్తంగా మీద ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి రావడం విస్తు పోయేలా చేసింది. ఈసారి బెంగళూరు వేదికగా జరిగిన మెగా వేలం పాటలో ఉమ్రాన్ మాలిక్(Umran Malik) ను ఏరికోరి తీసుకుంది సన్ రైజర్స్ యాజమాన్యం సిఇఓ కావ్య మారన్. పర్పుల్ రేసులో నిలిచాడు. కానీ టాప్ లో యజ్వేంద్ర చహల్ ఉన్నాడు.
Also Read : యుజ్వేంద్ర చాహల్ కు మళ్లీ పిలుపు