Pujara Azaharuddin : అజ్జూ రికార్డును సమం చేసిన పుజారా
ఆ అరుదైన రికార్డుకు 28 ఏళ్లు
Pujara Azaharuddin : భారత క్రికెట్ చరిత్రలో వస్తూనే మూడు సెంచరీలతో సత్తా చాటిన ఏకైక క్రికెటర్ గా ఇప్పటికీ ఒకే ఒక్కడు హైదరాబాదీ, మణికట్టు మాంత్రికుడిగా పేరొందిన మహమ్మద్ అజహరుద్దీన్ పైనే రికార్డు నమోదై ఉంది.
దీనిని ఇంకా ఏ ఆటగాడు బద్దలు కొట్టలేదు. భారత జట్టుకు కెప్టెన్ గా అనేక విజయాలు అందించాడు. అంతే కాదు క్రికెట్ జట్టుతో పాటు బీసీసీఐని శాసిస్తూ వచ్చిన ముంబై ఆధిపత్యానికి మొదటిసారిగా చెక్ పెట్టాడు అజ్జూ భాయ్.
ఆపై ఇంగ్లాండ్ కౌంటీల్లో అద్భుతంగా రాణించాడు. ఆయన అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఆ చరిత్రకు 28 ఏళ్లు. అజహరుద్దీన్ సాధించిన ఆ రికార్డును సమం చేశాడు చతేశ్వర్ పుజారా(Pujara) 2022లో. ఫ్లిక్కింగ్ షాట్స్ ఆడడంలో అజ్జూ తర్వాతే ఎవరైనా.
ఇక భారత జట్టులో స్థానం కోల్పోయిన పుజారా ఇంగ్లండ్ కౌంటీలో ఆడడం ప్రారంభించాడు. అక్కడ అద్భుతమైన ఫామ్ తో రాణించాడు. పరుగుల వరద పారించాడు. కౌంటీలో రెండో డబుల్ సెంచరీ సాధించాడు.
హోవ్ లో డర్హామ్ తో జరిగిన మ్యాచ్ లో ససెక్స్ తరపున ఆడిన ఛతేశ్వర్ పుజారా(Pujara) 203 పరుగులు చేశాడు. దీంతో 28 ఏళ్ల కిందట ఇదే కౌంటీలో అజహరుద్దీన్(Azaharuddin) చేసిన డబుల్ సెంచరీ రికార్డును సమం చేశాడు.
వరుసగా కౌంటీ మ్యాచ్ ల్లో 201, 109, 203 రన్స్ చేశాడు పుజారా. ఇక గతంలో 1991లో లీసెస్టర్ షైర్ పై 2012, 1994లో డర్హామ్ పై 205 పరుగులు చేశాడు మాజీ కెప్టెన్ అజహరుద్దీన్. ఆయన పేరుతో ఉన్న రికార్డును పుజారా సమం చేయడం విశేషం.
Also Read : పుజారా పట్టు వదలని విక్రమార్కుడు