Sourav Ganguly : దాదా బంగ్లా ఖరీదు మామూలు లేదుగా
బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీనా మజాకా
Sourav Ganguly : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) చీఫ్ గా ఉన్న సౌరవ్ గంగూలీ మరోసారి వార్తల్లో నిలిచారు. దేశ వ్యాప్తంగా ఆయన హాట్ టాపిక్ గా మారారు.
ఓ వైపు భారత క్రికెట్ భవితవ్యాన్ని శాసిస్తున్న గంగూలీ(Sourav Ganguly) అలియాస్ దాదా ఏకంగా భారీ ఖర్చుతో బంగ్లాను కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ ఇల్లు ధర లక్షల్లో అనుకుంటే పొరపాటు పడినట్లే ఏకంగా ధర కళ్లు బైర్లు కమ్మేలా ఉంది.
ఏకంగా ఆ భవనం ఖరీదు అక్షరాల రూ. 40 కోట్లు. ఈ భవనాన్ని తన భార్య డోనా, కూతురు సన, తల్లి నిరూప లను ఈ ఆస్తికి సహ యజమానులుగా చేర్చాడు సౌరవ్ గంగూలీ.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా లోని లయర్ రాడన్ స్ట్రీలో ఉన్న దీనిని చేజిక్కించుకున్నాడు దాదా. 48 ఏళ్ల తర్వాత తన పూర్వీకులు ఇచ్చిన ఇంటిని విడిచి పెట్ట బోతున్నాడు.
ఇది రెండతస్తుల భవనంతో కూడిన 23.6-3 కోటా ఫ్లాట్ ను కొనుగోలు చేశాడు సౌరవ్ గంగూలీ.ఇల్లు రద్దీగా ఉండే సెంట్రల్ కోల్ కతా
పరిసర ప్రాంతంలో ఉంది. రోడ్డు వెడల్పుగా ఉండడంతో టవర్ అభివృద్ధి అవుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు.
ఇది పూర్తిగా దాదా కొనుగోలు చేసిన వాల్యూ కు రెట్టింపు ధర భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా
గంగూలీ(Sourav Ganguly) పదవీ విరమణ పొందిన తర్వాత కూడా ఆయనను ఇప్పటికీ దాదా అని పిలుచుకుంటారు.
ఎక్కువగా అభిమానిస్తారు. ప్రజాదరణ పొందిన క్రికెటర్లలో ఒకరుగా ఉన్నారు. బీసీసీఐ ప్రెసిడెంట్ ప్రస్తుతం తన కుటుంబీకులతో కలిసి బెహలా లోని బీరెన్ రాయ్ రోడ్ లోని రాజ భవన గృహంలో నివసిస్తున్నారు. ఆయన ఆ పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగారు.
Also Read : కశ్మీర్ ఎక్స్ ప్రెస్ కు భలే ఛాన్స్