Jasprit Bumrah : జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత
ఏడు సీజన్లలో వరుసగా 15 వికెట్లు
Jasprit Bumrah : భారత క్రికెట్ జట్టులో మోస్ట్ పాపులర్ బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది జస్ ప్రీత్ బుమ్రా. ఎలాంటి భేషజాలు ప్రదర్శించకుండా కేవలం ఆటపై ప్రధానంగా బౌలింగ్ పై ఫోకస్ పెడుతున్న వర్ధమాన బౌలర్లలో బుమ్రా ఒక్కడేనని చెప్పడంలో సందేహం లేదు.
ఇండియన్ ప్రిమీయర్ లీగ్ 2022లో అరుదైన ఘనతను సాధించాడు జస్ ప్రీత్ బుమ్రా. ఇప్పటికే ఆ జట్టు రిచ్ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. కానీ జట్టు సాధించిన విజయాలలో కీలక పాత్ర మాత్రం బుమ్రా(Jasprit Bumrah) పోషించాడు.
అతడితో పాటు తెలంగాణ తేజం హైదరాబాదీ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ సైతం ముంబై ఇండియన్స్ తరపున అద్బుతంగా ఆడాడు. ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను మట్టి కరిపించింది ముంబై.
ముందుగా బరిలోకి దిగిన ఢిల్లీకి చుక్కలు చూపించాడు జస్ ప్రీత్ బుమ్రా. ఏకంగా 4 ఓవర్లు వేసి 3 కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు. పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశాడు.
దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఈసారి ఐపీఎల్ 2022లో బుమ్రా 15 వికెట్లు తీశాడు. ఇక ఇప్పటి వరకు దేశంలో ఐపీఎల్ లీగ్ పోటీలు 15 సార్లు జరిగాయి.
2008లో ప్రారంభమైంది ఐపీఎల్. జస్ ప్రీత్ బుమ్రా వరుసగా 7 సార్లు 15 వికెట్ల చొప్పున తీసి చరిత్ర సృష్టించాడు. అరుదైన ఘనతను తన పేరిట స్వంతం చేసుకున్నాడు. ఈ ఘనతను సాధించిన ఏకైక భారత క్రికెటర్ బుమ్రా(Jasprit Bumrah) కావడం విశేషం.
Also Read : ప్లే ఆఫ్స్ లో సత్తా చాటేదెవరు