IPL 2022 Playoffs : ప్లే ఆఫ్స్ లో సత్తా చాటేదెవరు
నాలుగు జట్ల మధ్య సిసలైన పోరు
IPL 2022 Playoffs : ప్రపంచ వ్యాప్తంగా జనాదరణ కలిగిన ఏకైక రిచ్ టోర్నీగా పేరు పొందింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్వహిస్తున్న ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్). 2008లో దీనిని లలిత్ మోదీ ప్రారంభించారు.
ఆ తర్వాత అవినీతి ఆరోపణలు రావడంతో కనుమరుగయ్యారు. ఇప్పుడు ఐపీఎల్ అంటే ఆట కాదు కోట్లాది రూపాయల విలువ కలిగిన అక్షయ పాత్ర. ఇప్పటి వరకు 14వ సీజన్లు ముగిశాయి.
ముంబై వేదికగా జరుగుతున్న ఈ ఐపీఎల్ 2022 టోర్నీ 15వ సీజన్. ఇప్పటి వరకు 8 జట్లు పాల్గొన్నాయి. కానీ ఈసారి కొత్తగా రెండు జట్లు పాల్గొన్నాయి.
ఆ జట్లు గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ . భారత మాజీ క్రికెటర్ , బౌలర్ ఆశిష్ నెహ్రా మార్గదర్శకత్వం (హెడ్ కోచ్ )లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది.
20 పాయింట్లు సాధించి నెంబర్ 1లో ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతం గంభీర్ మెంటార్ షిప్ లో కేఎల్ రాహుల్ నేతృత్వంలో
లక్నో సూపర్ జెయొంట్స్ మూడో స్థానంలో నిలిచింది ప్లే ఆఫ్స్(IPL 2022 Playoffs) లో.
ఇక కేరళ స్టార్ హిట్టర్ సంజూ శాంసన్ నాయకత్వంలో కుమార సంగక్కర హెడ్ కోచ్ గా రాజస్తాన్ రాయల్స్ రెండో స్థానం సాధించి సత్తా చాటింది.
ఇక మూడో జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంది.
ఎందుకంటే ఆ జట్టు కష్టపడి ప్లే ఆఫ్స్ కు చేరుకోలేదు. అదృష్టం బాగుండి నాలుగో ప్లేస్ దక్కించుకుంది. విచిత్రం ఏమిటంటే ఢిల్లీ
దానికంటే బెటర్ గా ఉంది.
కానీ కీలక లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి పోవడంతో లక్ కలిసొచ్చి ప్లే ఆఫ్స్(IPL 2022 Playoffs) కు చేరింది ఆర్సీబీ.
ఈ నాలుగు జట్లలో మూడు జట్లు బలంగా కనిపిస్తున్నాయి.
అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో దుమ్ము రేపుతున్నాయి ఈ జట్లు. మంగళవారం సమ ఉజ్జీల మధ్య పోరు కొనసాగనుంది. గుజరాత్,
రాజస్తాన్ తలపడతాయి. లక్నో కూడా టైటిల్ కోసం వేచి చూస్తోంది.
ఆర్సీబీ ఈ ఛాన్స్ మిస్ కాకూడదని తనకు అందకుండా ఉన్న ఐపీఎల్ టైటిల్ ఎగరేసుకు పోవాలని డిసైడ్ అయ్యింది. మరి ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.
Also Read : హైదరాబాద్ కు షాక్ పంజాబ్ విక్టరీ