Lalit Modi IPL : ఆనాటి ఐపీఎల్ వెనుక అతడు
అవినీతి ఆరోపణలతో నిష్క్రమణ
Lalit Modi IPL : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన క్రీడా సంస్థగా నిలిచింది. పేరు పొందింది. ప్రధానంగా ఈ దేశానికి కరువు వచ్చినా కేంద్ర సర్కార్ కు అప్పు ఇచ్చే స్థాయికి చేరుకుంది.
ఇది పక్కన పెడితే బీసీసీఐకి ఆర్థిక జవసత్వాలు కల్పించింది మాత్రం దివంగత పశ్చిమ బెంగాల్ కు చెందిన జగన్మోహన్ దాల్మియాను గుర్తు తెచ్చుకోవాల్సిందే. ఇక మరింత జనాదరణ కలిగించేలా చేసింది మాత్రం లలిత్ మోదీ.
ఒకప్పుడు ఇండియా అంటే హాకీకి పేరు. కానీ ఇవాళ భారత దేశం అంటేనే క్రికెట్. క్రికెట్ అంటేనే ఇండియా. భారత్ లో గల్లీ నుంచి ఢిల్లీ దాకా పేరు పొందేలా చేసిన ఘనత మాత్రం ఇద్దరిదే.
ఒకరు 1983లో భారత్ కు ప్రపంచ కప్ తీసుకు వచ్చిన కపిల్ దేవ్ అయితే ప్రపంచ వ్యాప్తంగా భారత్ కు ఎనలేని విజయాలు సాధించి పెట్టిన మహమ్మద్ అజహరుద్దీన్.
ఇక ఐపీఎల్ వరకు వచ్చే సరికల్లా ఇది పూర్తిగా 20 ఓవర్ల ఫార్మాట్ తో కూడుకుని ఉంది. క్రీడాభిమానులకు ఫుల్ జోష్ తీసుకు వచ్చేందుకు
ఈ రిచ్ లీగ్ ను ఏర్పాటు చేశారు.
ఈ ఒక్క ఐపీఎల్ ద్వారా ఎంతో మంది యువ క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. పురుషులే కాదు మహిళల ఐపీఎల్ కూడా 2023లో ప్లాన్ చేసింది బీసీసీఐ. 13 సెప్టెంబర్ 2007న టీ20 వరల్డ్ కప్ ను భారత్ కైవసం చేసుకుంది.
ఈ నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్ ను ప్రకటించారు ఆనాటి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న లలిత్ మోడీ(Lalit Modi IPL). ఏప్రిల్ 2008లో హై
ప్రొఫైల్ వేడుకతో ప్రారంభించారు. ఆనాటి నుంచి నేటి దాకా కంటిన్యూగా కోట్లు కురిపిస్తూ వస్తోంది ఐపీఎల్.
టోర్నమెంట్ ఫార్మాట్, ప్రైజ్ మనీ, ఫ్రాంచైజీ ఆదాయ వ్యవస్థ, స్క్వాడ్ కంపోజిషన్ రూల్స్ కూడా ఆనాడే ప్రకటించారు. మాజీ భారత ఆటగాళ్లు,
బీసీసీఐ అధికారులతో కూడిన ఏడుగురు గవర్నింగ్ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు.
ఆనాటి బేస్ ధరలు $400 మిలియన్లు బేస్ ధర ప్రకటించింది బీసీసీఐ. చివరకు $723.59 మిలియన్ల ఆదాయం సమకూరింది.
ఇదిలా ఉండగా అనూహ్య పరిణామాలు, ఐపీఎల్ లో భారీ స్కామ్ చోటు చేసుకోవడం, అది వెలుగులోకి రావడంతో లలిత్ మోదీ(Lalit Modi IPL)
పై కేసు నమోదైంది. ఆయన విదేశాల్లోనే ఉంటున్నారు.
Also Read : ఐపీఎల్ ఆట కాదు అక్షయపాత్ర