Lalit Modi : అత్యున్నత స్థానం నుంచి అధః పాతాళానికి
బీసీసీఐ మాజీ వైస్ ప్రెసిడెంట్ లలిత్ మోదీ స్కాం
Lalit Modi : ఎవరీ లలిత్ మోదీ అనుకుంటున్నారా. ఒకప్పుడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును శాసించిన వాడు. ఆటకు ఆదాయం రుచి చూపించిన వాడు. అంతే కాదు కోట్లాది రూపాయలతో బీసీసీఐ ఖజానా నింపిన వ్యక్తి.
అంతే కాదు ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన రిచ్ లీగ్ గా పేరొందిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ స్థాపించడం వెనుక ఉన్నది ఒకే ఒక్కడు అతడే లలిత్ మోదీ(Lalit Modi).
ఒక స్థాయికి ఎదిగిన తర్వాత దానిని దుర్వినియోగం చేస్తే ఎలాంటి ఇబ్బంది పడాల్సి వస్తుందో ఆయనను చూస్తే తెలుస్తుంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన లలిత్ మోదీ ఇప్పుడు ఒంటరిగా లండన్ లో తలదాచుకున్నారు.
భారత దేశం భిన్నత్వంతో కూడిన విశాల దేశం. ఎన్నో కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య ఉన్న 135 కోట్ల భారతీయులను కలిపి ఉంచుతున్నది మాత్రం క్రికెట్ ఒక్కటే.
క్రికెట్ కు ఉన్న ఆదరణను గుర్తించిన ఏకైక వ్యక్తి ఇండియాలో పశ్చిమ బెంగాల్ కు చెందిన జగన్మోహన్ దాల్మియా. దానిని మరింత ప్రపంచ వ్యాప్తం చేసిన ఏకైక వ్యక్తి మాత్రం లలిత్ మోదీ అని చెప్పక తప్పదు.
ఇవాళ ఆయన స్కామ్ లో నిందితుడిగా ఉండవచ్చు. కానీ కోట్లాది రూపాయల ఆదాయాన్ని సమకూర్చి పెట్టేలా చేసింది మాత్రం అతడు మాత్రమే. ఎవరీ లలిత్ మోదీ అనుకుంటున్నారా. ఒక విజేతగా నిలిచి చివరకు పరాజితుడిగా మిగిలి పోయాడు.
1963లో ఢిల్లీలో పుట్టాడు. కిషన్ కుమార్ మోడీకి పెద్ద కొడుకు. లలిత్ మోదీ(Lalit Modi) వ్యాపార కుటుంబంలో పెరిగా. కుటుంబ వ్యాపార నిర్వహణకు సంబంధించి నేర్చుకున్నాడు. ఇంజనీరింగ్ , ఎంబీఏ చదివేందుకు యుకెకు వెళ్లాడు.
1985లో లలిత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొకైన్ అక్రమ రవాణా, రెండవ స్థాయి కిడ్నాప్ నకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు.
1986లో అనారోగ్య కారణాలతో ఇండియాకు తిరిగి వచ్చేందుకు కోర్టు నుంచి పర్మిషన్ పొందాడు.
తన కుటుంబ వ్యాపారంలో వృత్తి స్టార్ట్ చేశాడు. గాడ్ ఫ్రే ఫిలిప్స్ ఇండియాలో చేరాడు. మోదీ ఎంటర్ ప్రైజెస్ , ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్ మధ్య జాయింట్ వెంచర్. ఇందులో 1992లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పదోన్నతి పొందాడు.
1993లో మోడీ ఎంటర్ టైన్మెంట్ నెట్ వర్క్ రూపంలో అతడికి ఫ్యూచర్ కనిపించింది. అంతర్జాతీయ వినోదం, స్పోర్ట్స్ ఛానల్స్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వాల్ట్ డిస్నీతో ఒప్పందం కుదుర్చుకునేలా చేశాడు.
ఇక్కడే పొరపాటు జరిగింది. లలిత్ వ్యవహారంపై ఫిర్యాదు చేశాయి కంపెనీలు. ఎక్కడా నిరుత్సాహానికి గురి కాలేదు. ఎన్బీఏ లీగ్ తో సంబంధం
నెరిపాడు. ఆట దేశం కోసంతో పాటు ఆదాయం కూడా ఉండాలని ప్లాన్ చేశాడు లలిత్ మోదీ(Lalit Modi).
1999లో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ లో చేరాడు. 2004 నాటికి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఆ వెంటనే రాజస్తాన్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ గా ఎన్నికయ్యాడు. 2005లో బీసీసీఐకి వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు.
ఐపీఎల్ పై ఫోకస్ చేశాడు. 2008లో దానికి శ్రీకారం చుట్టాడు. భారీ ఆదాయాన్ని సమకూర్చేలా చేశాడు. లలిత్ మోదీ తీసుకున్న అనేక వ్యాపార
నిర్ణయాలు బీసీసీఐకి లాభం తెచ్చి పెట్టాయి. 2005 నుంచి 2008 మధ్య మూడేళ్ల కాలంలో ఆదాయం ఏడు రెట్లు పెరిగింది.
ఐపీఎల్ ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది. బడా వ్యాపారవేత్తలు ఎంటర్ అయ్యారు. ముఖేష్ అంబానీ, విజయ్ మాల్యా, షారుఖ్ ఖాన్ ,
శిల్పా షెట్టి , ప్రీతి జింతా తదితరులు జాయిన్ అయ్యారు.
ఐపీఎల్ ప్రపంచంలోని అతి పెద్ద స్పోర్ట్స్ లీగ్ లో ఒకటిగా నిలిచింది. 2010 నాటికి లలిత్ మోదీ కుంభకోణాలు, వివాదాల్లో చిక్కుకున్నాడు.
చివరకు లండన్ కు పారి పోయాడు.
ఆనాటి మంత్రిని ప్రభావితం చేశాడని ఆరోపణలున్నాయి. బీసీసీఐ లలిత్ మోదీని సస్పెండ్ చేసింది. ఐపీఎల్ చైర్మన్ పదవి నుంచి తొలగించింది. చివరకు ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.
2015లో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. లలిత్ మోదీ ఇండియాకు రాలేదు. ఆయనపై మోపిన అభియోగాలు ఎప్పటికీ పూర్తి కాలేదు.
Also Read : ఆనాటి ఐపీఎల్ వెనుక అతడు