IPL Title Sponsorship : టైటిల్ స్పాన్సర్‌షిప్ తో కోట్లే కోట్లు

రూ. 200 కోట్ల నుంచి రూ. 493 కోట్లు

IPL Title Sponsorship : బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో చేప‌డుతున్న ఐపీఎల్ టోర్నీ కోట్ల‌ను కురిపిస్తోంది. కేవ‌లం ప్ర‌సార హ‌క్కుల ద్వారా రాబోయే ఐదేళ్ల‌కు బీసీసీఐకి కాసుల పంట పండ‌బోతోంది.

భార‌త దేశ క్రీడా చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనంత‌గా ఆదాయం స‌మ‌కూర‌నుంది. రూ. 50,000 కోట్ల‌కు పైగా రానుంద‌ని అంచ‌నా. ఇక ఐపీఎల్ టైటిల్ స్పాన్స‌ర్ షిప్(IPL Title Sponsorship) కోసం ప‌లు కంపెనీలు పోటీ ప‌డ్డాయి.

ఈసారి భార‌తీయ దిగ్గ‌జ సంస్థ టాటా చేజిక్కించుకుంది. వీవో నిష్క్ర‌మించింది. ఇక ఆయా సీజ‌న్ల‌లో టైటిల్ స్పాన్స‌ర్ షిప్(IPL Title Sponsorship) లు ఏయే సంస్థ‌లు తీసుకున్నాయో చూస్తే క‌ళ్లు బైర్లు క‌మ్మ‌డం ఖాయం.

2008 నుండి 2012 వ‌ర‌కు టైటిల్ స్పాన్స‌ర్ గా భార‌త దేశ‌పు అతి పెద్ద రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌ప‌ర్ గా ఉన్న డీఎల్ఎఫ్ రూ. 200 కోట్ల‌కు చేజిక్కించుకుంది.

అనంత‌రం అమెరికా శీత‌ల పానియాల కంపెనీ పెప్సికో కంపెక‌నీ టైటిల్ స్పాన్స‌ర్ చేజిక్కించుకుంది ఏకంగా రూ. 397 కోట్లకు. 2015లో కంపెనీ ఒప్పందాన్ని ముగించింది.

చైనీస్ స్మార్ట్ ఫోన్ త‌యారీ దారు వివోకు రూ. 200 కోట్ల‌కు బ‌దిలీ చేసింది. ఏకంగా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో రూ. 2,199 కోట్ల‌కు చేజిక్కించుకుంది వివో.

ఇదే స‌మ‌యంలో భార‌త‌, చైనా దేశాల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌ల కార‌ణంగా చైనా కంపెనీ త‌ప్పుకుంది. 2020 ఐపీఎల్ కోసం రూ. 222 కోట్ల‌కు డ్రీమ్ 11 టైటిల్ స్పాన్స‌ర్ షిప్ పొందింది.

2022 నుంచి 2023 వ‌ర‌కు భార‌త వ్యాపార దిగ్గ‌జం టాటా సంస్థ టేకోవ‌ర్ చేసుకుంది. దీని వాల్యూ రూ. 498 కోట్లు.

Also Read : ఐపీఎల్ అవార్డులు ద‌క్కేదెవ‌రికో

Leave A Reply

Your Email Id will not be published!