Telangana SSC Exams 2022 : తెలంగాణ‌లో ప‌ద‌వ తరగతి పరీక్షలు స్టార్ట్

జూన్ నెలాఖ‌రుకు రిజల్ట్స్ డిక్లేర్

Telangana SSC Exams 2022 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ప్ర‌క‌టించిన విధంగానే ఈనెల 23 సోమ‌వారం నుంచి ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు(Telangana SSC Exams 2022) ప్రారంభ‌మ‌య్యాయి. పెద్ద ఎత్తున ఈ సంద‌ర్భంగా భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

ప్ర‌భుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మొత్తం 2,861 ప‌రీక్ష కేంద్రాలు ఉన్నాయి. దాదాపు 5.08 లక్ష‌ల మంది విద్యార్థులు ప‌రీక్ష రాస్తున్నారు. ప‌రీక్ష‌ల ఏర్పాటుపై డైరెక్ట‌ర్ వ‌ర్చువ‌ల్ ప‌ద్ద‌తిలో స‌మీక్ష చేప‌ట్టారు.

విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏండేందుకు తాగు, వ‌స‌తి సౌక‌ర్యం క‌ల్పించారు. ఎండా కాలం కావ‌డంతో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌పై ఫోక‌స్ పెట్టాల‌ని ఆదేశించారు.

అద‌న‌పు బ‌ల్ల‌లు, ఇత‌ర సౌక‌ర్యాల‌కు ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేయాల‌ని, వాటికి అయ్యే ఖ‌ర్చు ప‌రీక్ష‌ల విభాగం భ‌రిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే జూన్ నెలాఖ‌రు వ‌ర‌కు ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తాని వెల్ల‌డించారు.

జూన్ 2 నుంచే ప‌రీక్ష‌ల‌కు (Telangana SSC Exams 2022) సంబంధించి జ‌వాబు ప‌త్రాలు దిద్ద‌డం ప్రారంభ‌మ‌వుతుంద‌ని తెలిపారు. ప్ర‌తి చోటా నిఘా వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేశామ‌ని, ఎలాంటి అవ‌క‌వ‌త‌క‌లు జ‌రిగేందుకు ఆస్కారం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ప్ర‌తి ప‌రీక్షా కేంద్రం వ‌ద్ద సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరాల‌ను జిల్లా ఉన్న‌తాధికారుల‌కు అనుసంధానం చేశారు. అక్క‌డి నుంచి వారు నిత్యం ప‌ర్య‌వేక్షిస్తుంటారు.

దీని వ‌ల్ల ఎవ‌రు ఏం చేస్తున్నార‌నేది క్లియ‌ర్ గా తెలిసి పోతుంద‌న్నారు. ఏ మాత్రం ఏమ‌రుపాటుగా ఉన్నా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

నిర్ల‌క్ష్యం వ‌హిస్తే స‌హించేది లేద‌ని హెచ్చ‌రించారు. ఇక ప‌రీక్షా కేంద్రాల‌ను ప్ర‌త్యేకంగా నియ‌మించిన స్క్వాడ్ టీం ప‌ర్య‌వేక్షిస్తుంద‌న్నారు.

Also Read : బోధ‌నేత‌ర‌ పోస్టుల భ‌ర్తీకి ఛాన్స్

Leave A Reply

Your Email Id will not be published!