Sourav Ganguly : పంత్ ను ధోనీతో పోల్చకండి – గంగూలీ
స్పష్టం చేసిన బీసీసీఐ బాస్ దాదా
Sourav Ganguly : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బాస్ సౌరవ్ గంగూలీ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన రిషబ్ పంత్ ను మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్, ప్రస్తుత సీఎస్కే సారథి మహేంద్ర సింగ్ ధోనీతో పోల్చడాన్ని తీవ్రంగా తప్పు పట్టాడు.
ఎవరి ఆట తీరు వాళ్లకు ఉంటుందని, ఇంకొకరితో పోల్చడం సరికాదన్నాడు. పంత్ ఎక్కడ ధోనీ ఎక్కడ. ధోనీ మోస్ట్ ఫెవరబుల్, పవర్ ఫుల్ ప్లేయర్ అని పేర్కొన్నాడు. ఇంకా క్రికెట్ లో నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నాడు సౌరవ్ గంగూలీ(Sourav Ganguly).
ఒక రకంగా ధోనీని వెనకేసుకు వచ్చాడు. అదే సమయంలో రిషబ్ పంత్ కు చాలా ఫ్యూచర్ ఉందని, రాణించాలంటే శ్రమించడం తప్ప మరో మార్గం లేదన్నాడు. ఐపీఎల్ 2022లో భాగంగా లీగ్ మ్యాచ్ లు ముగిశాయి.
మంగళవారం ప్లే ఆఫ్స్ కు చేరుకున్న గుజరాత్ టైటాన్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య క్వాలిఫయిర్ -1 కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్ లో జరగనుంది. ఈ సందర్భంగా బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ మైదానాన్ని పరిశీలించారు.
కొంచెం వాతావరణం ఇబ్బందికరంగా మారడంతో స్టేడియంకు వచ్చారు. దీంతో పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సౌరవ్ గంగూలీ మీడియాతో మాట్లాడారు.
అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లో చాలా మ్యాచ్ లకు సారథిగా వ్యవహరిస్తున్న ఎంఎస్ ధోనీ ఎప్పుడూ రిషబ్ పంత్ ను పోల్చవద్దని సూచించాడు.
పంత్ ఆ స్థాయికి ఎదగాలంటే చాలా కాలం పడుతుందన్నాడు సౌరవ్ గంగూలీ(Sourav Ganguly).
Also Read : ఐపీఎల్ లో సిక్సర్ల మోత అరుదైన ఘనత