Hardik Pandya : గతం మరిచిపోను సక్సెస్ కు పొంగిపోను
గుజరాత్ టైటాన్స్ స్కిప్పర్ హార్దిక్ పాండ్యా
Hardik Pandya : కోల్ కతా వేదికగా ఈడెన్ గార్డెన్ మైదానంలో జరిగిన ఐపీఎల్ క్వాలిఫయిర్ -1 మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ . ఐపీఎల్ రిచ్ లీగ్ లో ఇది 11వ విజయం.
15 మ్యాచ్ లు ఆడింది ఈ జట్టు . 11 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండానే ఫైనల్ కు చేరింది.
ఇక ఎలిమినేటర్ మ్యాచ్ లో విజయం సాధించిన టీమ్ తో రాజస్తాన్ రాయల్స్ ఆడనుంది శుక్రవారం. ఆదివారం 29న ఐపీఎల్ పోరు ముగుస్తుంది.
రాజస్తాన్ పై ఘన విజయం సాధించిన అనంతరం గుజరాత్ టైటాన్స్ స్కిప్పర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) మీడియాతో మాట్లాడాడు. తాను విజయాలకు పొంగి పోవడం లేదన్నారు.
నేల విడిచి సాము చేసే రకం తాను కాదన్నారు. జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. కానీ నా భార్య, నా కొడుకు, అన్నతో ఉన్న ఫ్యామిలీ తనకు అండగా ఉంటూ వచ్చిందన్నాడు.
ఈ రెండేళ్ల కాలంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. వాటన్నింటిని నేను అనుభవంలోకి తెచ్చుకున్నా. భావోద్వేగాలకు అతీతంగా ఎలా బతకాలో చూసి నేర్చుకున్నానని అదే ఇప్పుడు కెప్టెన్ గా చేసేందుకు పనికి వచ్చేలా చేసిందని చెప్పాడు హార్దిక్ పాండ్యా(Hardik Pandya).
మా జట్టులో ప్రతి ఒక్కరు టీమ్ లో ఉన్న వాళ్లు స్టాండ్స్ లో ఆడని వాళ్లు సైతం అంతా పాజిటివ్ (సానుకూల) దృక్ఫథంతో ఉన్నారని వారి వల్లే ఈ విజయాలు దక్కాయని స్పష్టం చేశాడు ఈ స్టార్ కెప్టెన్.
సుదీర్గ కాలం తర్వాత పాండ్యా తిరిగి భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఇదంతా ఐపీఎల్ పుణ్యమేనని చెప్పక తప్పదు.
Also Read : సంజూ శాంసన్ షాన్ దార్ ఇన్నింగ్స్