RR vs RCB Qualifier2 : యుద్ధానికి సిద్దం గెలుపు కోసం పోరాటం
రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ బెంగళూరు
RR vs RCB Qualifier2 : గత రెండు నెలలుగా కొనసాగుతూ వచ్చిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) చివరి దశ ముగిసేందుకు కేవలం రెండు అడుగుల దూరంలో ఉంది. ఇప్పటి దాకా లీగ్ మ్యాచ్ లు ముగిశాయి.
ప్లే ఆఫ్స్ కు సంబంధించి క్వాలిఫయిర్ -1 , ఎలిమినేటర్ పూర్తయింది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కి చేరింది. గుజరాత్ లోని అహ్మదాబాద్
మోదీ స్టేడియంలో ఈనెల 29న తలపడేందుకు రెడీ అయ్యింది.
తనతో పోటీకి ఎవరు వస్తారనే దానిపై వేచి చూస్తోంది. తనతో ఓడి పోయిన రాజస్థాన్ రాయల్స్(RR vs RCB Qualifier2) ఒక్క అడుగు దూరంలో ఉన్న ఫైనల్ కోసం రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరుతో పోటీ పడనుంది.
ఈ ఉత్కంఠ భరిత పోరుపై కోట్లాది అభిమానులు, తాజా, మాజీ ఆటగాళ్లు ఎప్పుడు ఆడతారా అని ఎదురు చూస్తున్నారు. ఎలిమినేటర్ లో
లక్నో సూపర్ జెయింట్స్ ను 14 పరుగుల తేడాతో ఓడించిన ఆర్సీబీ(RR vs RCB Qualifier2) ఫుల్ జోష్ లో ఉంది.
ఇక గుజరాత్ తో ఓటమి పాలైన రాజస్తాన్ రాయల్స్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఐపీఎల్ 15వ సీజన్ లో సెమీ ఫైనల్ గా భావించే ఈ మ్యాచ్ లో
ఇరు జట్లు తమ శక్తి యుక్తులను ప్రదర్శించే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
ఐపీఎల్ లీగ్ ఆరంభంలో దివంగత షేన్ వార్న్ సారథ్యంలో రాజస్తాన్ టైటిల్ గెలిచింది. ఇప్పటి వరకు ఆ దరి దాపుల్లోకి రాలేదు. మోదీ
స్టేడియంలో అసలైన పోరుకు వేదికగా మారనుంది.
లక్నోతో జరిగిన మ్యాచ్ లో అన్ క్యాప్డ్ ప్లేయర్ రజత్ పాటిదార్, కోహ్లీ, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్ , హాజిల్ వుడ్ సత్తా చాటారు. ఇంకో
వైపు ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన రాజస్తాన్ నిలకడగా ఆడుతూ ప్లే ఆఫ్స్ కు చేరింది.
జైశ్వాల్, బట్లర్ , పడిక్కల్ , శాంసన్ , ఆర్. అశ్విన్, హిట్ మైర్ , చాహల్ సత్తా చాటేందుకు రెడీ గా ఉన్నారు. ఇక బౌలింగ్ పరంగా
బెంగళూరు బలంగా కనిపిస్తోంది.
Also Read : విజయానికి అడుగు దూరంలో ఆర్సీబీ