RCB IPL 2022 Qualifier2 : విజయానికి అడుగు దూరంలో ఆర్సీబీ
రాజస్తాన్ వర్సెస్ బెంగళూరు
RCB IPL 2022 Qualifier2 : ఐపీఎల్ 2022లో నువ్వా నేనా అన్న రీతిలో సాగే మ్యాచ్ కు వేదిక కానుంది గుజరాత్ లోని అహ్మదాబాద్ మోదీ స్టేడియం. ఢిల్లీ పుణ్యమా అని ప్లే ఆఫ్స్ కు చేరింది పాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB IPL 2022 Qualifier2) జట్టు.
ఆపై అద్భుతమైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ కు చేరి మూడో స్థానంలో నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ను ఎలిమినేటర్ మ్యాచ్ లో 14 పరుగుల తేడాతో ఓడించి సత్తా చాటింది. తనకు ఎదురే లేదని నిరూపించింది.
ప్రధానంగా చెప్పు కోవాల్సింది. స్టార్ ఆటగాళ్లు విఫలమైనా ఆఖరులో సిసోడియా గాయపడడంతో అనుకోకుండా జట్టులోకి వచ్చిన మధ్య ప్రదేశ్ క్రికెటర్ రజత్ పాటిదార్ కలకాలం గుర్తు పెట్టుకునేలా ఆడాడు.
లక్నో ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా 12 ఫోర్లు 7 సిక్సర్లతో 112 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. ఇక కోహ్లీ నిలకడగా ఆడితే ఆఖరున వచ్చిన దినేశ్ కార్తీక్ మరోసారి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
37 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ లో హాజిల్ వుడ్ , హర్షల్ పటేల్ అద్భుతంగా రాణించడంతో బెంగళూరు గెలుపు సాధించి రాజస్తాన్ రాయల్స్ తో అమీ తుమీ తేల్చుకునేందుకు సన్నద్దమవుతోంది.
ఓ వైపు బ్యాటింగ్ లో దుర్బేద్యంగా కనిపిస్తోంది రాజస్తాన్. ఇంకో వైపు బౌలింగ్ లో రాణిస్తున్నా ఎందుకనో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన క్వాలిఫయిర్ మ్యాచ్ లో సత్తా చాటలేక పోయారు బౌలర్లు.
మొత్తంగా ఈ క్వాలిఫయిర్ -2 మ్యాచ్ మాత్రం బ్యాటింగ్ వర్సెస్ బౌలింగ్ మధ్య పోరు జరగడం ఖాయం.
Also Read : ఆర్సీబీ విజయం కోహ్లీ భావోద్వేగం