Sangakkara RR Coach : సంగక్కర ప్లాన్ వర్కవుట్ అవుతుందా
మిస్టర్ కూల్ గా పేరొందిన క్రికెట్ దిగ్గజం
Sangakkara RR Coach : మిస్టర్ కూల్ గా పేరొందిన శ్రీలంక మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర(Sangakkara RR Coach) ఏం చేయబోతున్నాడనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రతి జట్టు విజయాల వెనుక కచ్చితంగా ఒకరు ఉంటారు.
ఆ ఒక్కడు ఎవరో కాదు హెడ్ కోచ్. మొత్తం అతడిదే బాధ్యత. జట్టు ఎంపికలో, ఆటగాళ్లను తీర్చి దిద్దడంలో, ఆటకు సన్నద్ధం చేయడంలో , నిర్ణయాలు తీసుకోవడంలో కోచ్ పాత్ర అత్యంత ముఖ్యం.
అందరూ కెప్టెన్ వైపు వేలెత్తి చూపిస్తారు. గెలిస్తే ఓకే లేదంటే ఆరోపణలు, విమర్శలు. ఇవన్నీ ఆట అన్నాక సర్వ సాధారణం. శుక్రవారం కీలకమైన మ్యాచ్ కు వేదిక కానుంది అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియం.
ఐపీఎల్ 2022 ఫైనల్ కు ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నాయి రాజస్తాన్ రాయల్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇరు జట్లకు ఇది కీలక మైన మ్యాచ్ . ఎవరు గెలిస్తే వాళ్లు ఫైనల్ కు వెళతారు.
ఓడి పోయిన జట్టు ఇంటికి వెళ్లడం ఖాయం. ఇప్పటి వరకు చాలా కూల్ గా విజయాలు సాధిస్తూ వచ్చింది రాజస్తాన్ రాయల్స్. టోర్నీలో ఆరెంజ్ క్యాప్ , పర్పుల్ క్యాప్ రేసులో ఈ జట్టుకు చెందిన జోస్ బట్లర్, చాహల్ టాప్ లో ఉన్నారు.
ఇదంతా పక్కన పెడితే బ్యాటింగ్ లో బలంగా కనిపిస్తున్నా బౌలింగ్ లో మాత్రం ప్రధానంగా డెత్ ఓవర్స్ లో కీలకంగా బౌలింగ్ చేసే బౌలర్లు లేక పోవడం ఆ జట్టుకు మైనస్ పాయింట్ అని చెప్పక తప్పదు.
ఉత్కంఠ భరితంగా సాగే పోరులో రాజస్తాన్ ఎలాంటి ప్లాన్ వర్కవుట్ చేయబోతోందనే దానిపై హెడ్ కోచ్ కుమార సంగక్కర పైనే ఆధారపడి ఉంది.
Also Read : ఆర్సీబీ హెడ్ కోచ్ పైనే ఆశలన్నీ