Geetanjali Shree : మహిళా స్వరం భావోద్వేగాల సమ్మేళనం
తరాల అంతరాలను ప్రతిఫలించేలా రచనలు
Geetanjali Shree : యావత్ భారత దేశం తన వైపు తిప్పుకునేలా చేశారు గీతాంజలి శ్రీ. ఆమె రాసిన పుస్తకం అంతర్జాతీయంగా పేరొందిన బుకర్ ప్రైజ్ ను స్వంతం చేసుకుంది.
దీంతో ఆమె ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీశారు. ఒక రకంగా హిందీ నవలకు దక్కిన మొదటి గౌరవం కూడా. ఇంతకీ గీతాంజలి శ్రీ ఎవరు. ఆమె ఆలోచనా ధోరణి ఏంటి అనేది తెలుసు కోవాల్సిందే.
1957లో ఢిల్లీలో పుట్టారు. వయసు 64 ఏళ్లు. కథలు, నవలలు రాయడంలో ఆమె పరిణతి చెందారు. ప్రధానంగా భావోద్వేగాలను అక్షరాలుగా మల్చడంలో ప్రసిద్ది పొందారు. ఆమెను గీతాంజలి పాండే అని కూడా పిలుస్తారు.
2000లో ఆమె రాసిన మై 2001 క్రాస్ వర్డ్ బుక్ అవార్డు కోసం షార్ట్ లిస్ట్ చేయబడింది. 2017లో నియోగి బుక్స్ ప్రచురించిన నీతా కుమార్ ద్వారా అంగ్లంలోకి అనువాదం చేశారు.
2022లో డైసీ రాక్ వెల్ గీతాంజలి శ్రీ(Geetanjali Shree) హిందీలో రాసిన నవల రెట్ సమాధిని టోంబ్ ఆఫ్ శాండ్ గా ఆంగ్లంలోకి అనువాదం చేశారు. ఈ పుస్తకం ఈ ఏడాదికి బుకర్ ప్రైజ్ గెలుచుకుంది.
దాదాపు 50 వేల పౌండ్ల ప్రైజ్ మనీ దక్కింది గీతాంజలి శ్రీ(Geetanjali Shree) కి. ప్రముఖ భారతీయ నవలా రచయిత ప్రేమ్ చంద్ పై
విమర్శనాత్మక కథనం రాసింది. గీతాంజలి తండ్రి సివిల్ సర్వెంట్ కావడంతో ఆమె యూపీలోని పలు పట్టణాలలో పెరిగారు.
ఇంగ్లీషు లో పిల్లల పుస్తకాలు లేక పోవడంతో హిందీతో అనుబంధం పెంచుకున్నారు. ఆమె రాసిన మొదటి కథ బెల్ పాత్ర. ఇది 1987లో రాశారు.
సాహిత్య పత్రిక హన్స్ లో ప్రచురించారు.
చిన్న కథల సంకలనం అనుగూంజ్ 1991లో అచ్చయింది. ఆమె రాసిన నవల మై చాయిస్ (యొక్క) ఆంగ్ల అనువాదం భారీగా ఆదరణ చూరగొంది.
ఈ నవల ఉత్తర భారత మధ్య తరగతి కుటుంబంలో మూడు తరాల స్ట్రీలు, వారి చుట్టూ ఉన్న పురుషుల గురించి ప్రస్తావించారు.
సెర్బియన్, కొరియన్ భాషల్లోకి అనువాదం చేశారు.
అక్కడ కూడా పాపులర్ అయ్యింది. నీతా కుమార్ దీనిని ఆంగ్లంలోకి అనువాదం చేశారు. బషీర్ ఉన్వాన్ ఉర్దూలోకి ట్రాన్స్ లేట్ చేశారు. ఇది హిందీ, జర్మనీలోకి కూడా అనువాదం అయింది.
గీతాంజలి శ్రీ రెండో నవల హమారా షహర్ ఉస్ బరాస్ . ఇది బాబ్రీ మసీదు కూల్చి వేత సంఘటనల తర్వాత విడుదలైంది. ఆమె రాసిన
నాల్గో నవల ఖలీ జగా . 2006లో రాశారు.
దీనిని ఆంగ్లంలోకి ది ఎంప్టీ స్పేస్ గా పేరుతో నివేదితా మీనన్ అనువదించారు. ఫ్రెంచ్, జర్మన్ లోకి ట్రాన్స్ లేట్ అయ్యింది. ఇక గీతాంజలి
రాసిన ఐదో నవల రెట్ సమాధి. ఇది బుకర్ ప్రైజ్ తెచ్చేలా చేసింది.
Also Read : గీతాంజలి శ్రీకి బుకర్ ప్రైజ్