Jos Butler IPL 2022 : చెలరేగిన బట్లర్ ఠారెత్తిన బెంగళూర్
ఆకాశమే హద్దుగా చెలరేగిన క్రికెటర్
Jos Butler IPL 2022 : ఎలాగైనా సరే ఫైనల్ కు చేరాలని కలలు కన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాలిట సింహ స్వప్నంలా మారాడు స్టార్ హిట్టర్, ఇంగ్లండ్ క్రికెటర్ జోస్ బట్లర్(Jos Butler IPL 2022).
ఐపీఎల్ 2022లో భాగంగా అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో జరిగిన క్వాలిఫయిర్ -2 మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆట ఆరంభం నుంచీ చివరి దాకా ఉన్నాడు బట్లర్. తనదైన శైలితో విరుచుకు పడ్డాడు.
కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు. ఒకటా రెండా ఏకంగా 10 ఫోర్లు 6 భారీ సిక్సర్లు కొట్లాడు. ఎవరినీ ఉపేక్షించ లేదు. ఏ బౌలర్ కు ఛాన్స్ ఇవ్వలేదు. టార్గెట్ తక్కువే ఉన్నా ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా చెలరేగాడు బట్లర్.
ఉత్కంఠ భరితంగా నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతుందన్న మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచు కోవడంతోనే బెంగళూరు పతనం ప్రారంభమైంది.
రాజస్తాన్ బౌలర్లు ప్రసిద్ద్ క్రిష్ణ, మెక్ కాయ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రత్యర్థి జట్టును 20 ఓవర్లలో 8 వికెట్లకే కట్టడి చేశారు. దీంతో 157 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అనంతరం బరిలోకి దిగిన రాజస్తాన్ ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. యశస్వి జైశ్వాల్ , బట్లర్(Jos Butler IPL 2022) దంచి కొట్టారు. జైశ్వాల్ అవుట్ అయ్యాక వచ్చిన శాంసన్ అదే స్పీడ్ పెంచాడు.
23 పరుగుల వద్ద ఆరో సారి హసరంగకు దొరికి పోయాడు. అనంతరం జోస్ బట్లర్ తానొక్కడే ఆడాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ మ్యాచ్ పూర్తిగా జోస్ దే. 60 బంతులు ఆడి 106 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
Also Read : పటిదార్ రాణించినా తప్పని ఓటమి