Rajasthan Royals IPL 2022 : విమర్శకులకు షాకిచ్చిన రాజస్తాన్
బెంగళూరు గెలుస్తుందన్న హర్భజన్ సింగ్
Rajasthan Royals IPL 2022 : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ 2022 ముగిసేందుకు ఇంకా ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది. ఈసారి రిచ్ లీగ్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఊహించని రీతిలో ప్లే ఆఫ్స్ కు చేరుకుంది రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆపై అద్భుత విజయాలు నమోదు చేస్తూ వచ్చిన గంభీర్ కోచ్ గా ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ . కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ లో 14 పరుగుల తేడాతో దెబ్బ కొటింది ఆర్సీబీ.
అదే జోష్ తో ఉన్న ఆర్సీబీ అభిమానులు, తాజా, మాజీ క్రికెటర్లు సైతం ఇక బెంగళూరు దుమ్ము లేపడం ఖాయమని ప్రిడిక్షన్స్ ఇచ్చారు. ప్రత్యేకించి భారత జట్టు మాజీ క్రికెటర్ , స్టార్ స్పిన్నర్ , ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ హర్భజన్ సింగ్.
అయితే ఏకంగా రాయల్ చాలెంజర్స బెంగళూరు విజయం సాధిస్తుందని, ఇక ఐపీఎల్ టైటిల్ కూడా వాళ్లదేనని గొప్పలు పోయాడు. స్పోర్ట్స్
క్రీడా తో మాట్లాడాడు.
కానీ రాజస్తాన్ రాయల్స్ మొదటి నుంచి ఈసారి ఐపీఎల్ లీగ్ లో ఎలాంటి అంచనాలు లేకుండానే సైలంట్ గా విజయాలు సాధిస్తూ ప్లే ఆఫ్స్ కు
చేరింది. క్వాలిఫయిర్ -1తో గుజరాత్ టైటాన్స్ తో బౌలింగ్ కారణంగా ఓటమి పాలైంది.
ఇక రెండో ఛాన్స్ ను చక్కగా సద్వినియోగం చేసుకుంది. 70 శాతానికి పైగా అంతా ఆర్సీబీ గెలుస్తుందని అంచనాలు వేశారు. బెట్టింగ్ లు
కూడా కట్టారు. కానీ బెంగళూరుకు చుక్కలు చూపించింది రాజస్తాన్ రాయల్స్(Rajasthan Royals IPL 2022) .
మిస్టర్ కూల్ గా పేరొందిన సంజూ శాంసన్ అద్బుతమైన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. ఎవరిని ఎలా ఎక్కడ వాడుకోవాలో వాడుకుని బ్యాటర్లకు చుక్కలు చూపించేలా చేశాడు.
ప్రసిద్ద్ క్రిష్ణ 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీస్తే మెక్ కాక్ 23 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి సత్తా చాటారు. ఇక రాజస్తాన్ రాయల్స్ జట్టుకు
జోస్ బట్లర్ ఘన విజయాన్ని సాధించి పెట్టాడు.
మొత్తంగా సమిష్టి కృషితో తమను విమర్శించిన వారికి విజయంతో నోళ్లు మూయించింది రాజస్తాన్ రాయల్స్.
Also Read : బెంబేలెత్తించిన ఒబెడ్ మెక్‌కాయ్