Sanju Samson IPL 2022 : మిస్టర్ కూల్ కెప్టెన్సీ అదుర్స్
ప్రశంసలు అందుకున్న శాంసన్
Sanju Samson IPL 2022 : ఎలాంటి అంచనాలు లేకుండానే ఐపీఎల్ 2022లో అడుగు పెట్టింది కేరళ స్టార్ హిట్టర్ సంజూ శాంసన్(Sanju Samson IPL 2022) సారథ్యంలోని రాజస్తాన్ రాయల్స్ జట్టు. కొత్తగా కోచ్ గా వచ్చాక ఆ జట్టు ఆట స్వరూపాన్నే మార్చేశాడు శ్రీలంక క్రికెట్ మాజీ దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కర.
అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో సూపర్ గా ఆడేలా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు. ఆపై బౌలింగ్ కోసం ప్రత్యేకంగా స్టార్ బౌలర్ గా
ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన శ్రీలంక మాజీ క్రికెటర్ లసిత్ మళింగను తీసుకుంది యాజమాన్యం.
ఇంకేం అద్భుత విజయాలు నమోదు చేసింది రాజస్తాన్ రాయల్స్ . ఏకంగా ఈసారి 14 ఏళ్ల తర్వాత ఐపీఎల్ 2022 ఫైనల్ కు చేరింది. అంతకు ముందు రిచ్ లీగ్ లో 14 మ్యాచ్ లు ఆడింది. 9 మ్యాచ్ లలో గెలుపొందింది.
పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ కు చేరింది. రెండో స్థానంలో ఉన్న రాజస్తాన్ గుజరాత్ టైటాన్స్ తో క్వాలిఫయిర్ -1తో పోటీ
పడింది. 7 వికెట్ల తేడాతో ఓడి పోయింది. అనంతరం పట్టుదలతో ఆడింది. పంతం నెగ్గించుకుంది.
అద్భుత విజయాలు నమోదు చేస్తూ సంచలనం సృష్టిస్తూ వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ ను మట్టి కరిపించిన రాయల్ ఛాలెంజర్స్
బెంగళూరుతో క్వాలిఫయిర్ -2 మ్యాచ్ ఆడింది.
ఏకంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసి ఏకంగా ఐపీఎల్ ఫైనల్ కు చేరింది. ప్రధానంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson IPL 2022) ను మెచ్చుకోకుండా ఉండలేం.
టాస్ గెలిచాక ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఒక్క రియాన్ పరాగ్ క్యాచ్ జారవిడవడం తప్పితే ఎక్కడా పొరపాటు జరగలేదు. బౌలర్లందరినీ
చక్కగా వినియోగించు కున్నాడు. బౌల్ట్ , అశ్విన్ చెరో వికెట్ తీస్తే , ప్రసిద్ద్ క్రిష్ణ 3, మెక్ కాయ్ 3 వికెట్లతో రాణించారు.
తమపై కెప్టెన్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. మొత్తంగా ఇది సమిష్టి విజయానికి సంకేతం. ఇలాగే ఆడితే టైటిల్ గెలవడం అన్నది కష్టం కాదు.
Also Read : పటిదార్ రాణించినా తప్పని ఓటమి