Faf Du Plessis : విజ‌యానికి వారే అర్హులు – డుప్లెసిస్

బాధగా ఉన్న‌ప్ప‌టికీ బాగానే ఆడాం

Faf Du Plessis : ఐపీఎల్ 2022లో ఊహించ‌ని రీతిలో ప్లే ఆఫ్స్ కు చేరుకుని ఎలిమినేట‌ర్ లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ను మ‌ట్టి క‌రిపించి

దుమ్ము రేపిన రాయ‌ల్స్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు క్వాలిఫ‌యిర్ -2లో బొక్క బోర్లా పడింది.

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజ‌యం పాలైంది. రాజ‌స్తాన్ అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసింది. బెంగ‌ళూరు జ‌ట్టును కేవ‌లం 20 ఓవ‌ర్ల‌లో 157 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసింది.

ప్ర‌ధానంగా గుజ‌రాత్ తో తీవ్ర నిరాశ‌కు గురి చేసిన ప్ర‌సిద్ద్ క్రిష్ణ 22 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్లు తీస్తే మెక్ కాయ్ 23 ప‌రుగులు ఇచ్చి మ‌రో 3 వికెట్లు

తీసి ఆర్సీబీ ప‌త‌నాన్ని శాసించారు.

దీంతో 158 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కేవ‌లం 3 వికెట్లు కోల్పోయి స‌త్తా చాటింది. విజ‌యం సాధించి నేరుగా ఐపీఎల్ ఫైన‌ల్ కు చేరింది. ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది.

ఈ సంద‌ర్భంగా మ్యాచ్ ముగిసిన అనంత‌రం ఆర్సీబీ కెప్టెన్ పాఫ్ డుప్లెసిస్(Faf Du Plessis) మాట్లాడాడు. ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఓడి పోయినందుకు బాధ‌గా ఉంది.

కానీ మేం ఆట ప‌రంగా అద్భుతంగా ఆడామ‌ని చెప్పాడు. త‌మ‌కు ఈసారి ఐపీఎల్ గ్రేట్ సీజ‌న్ గా మిగిలి పోతుంద‌న్నాడు. క్వాలిఫ‌యిర్ దాకా

వ‌చ్చామంటే అదంతా ఆట‌గాళ్ల చ‌ల‌వ వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌న్నాడు డుప్లెసిస్ (Faf Du Plessis).

ప్ర‌త్యేకించి త‌మ జ‌ట్టుకు ఉన్న అభిమానుల గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నాడు. హ‌ర్ష‌ల్ ప‌టేల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

దినేశ్ కార్తీక్ మ‌ళ్లీ జ‌ట్టులోకి వ‌చ్చాడు.

ఇక ర‌జ‌త్ పాటిదార్ ఆక‌ట్టుకున్నాడు. మ్యాచ్ నిరాశ‌కు గురి చేసింది. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టు బ‌ల‌మైన జ‌ట్టు. మాకంటే విజ‌యానికే వారే అర్హులు

అని కితాబు ఇచ్చాడు.

Also Read : మిస్ట‌ర్ కూల్ కెప్టెన్సీ అదుర్స్

Leave A Reply

Your Email Id will not be published!