Jos Butler : షేన్ వార్న్ లేక పోవ‌డం బాధాక‌రం

ఆవేద‌న వ్య‌క్తం చేసిన జోస్ బ‌ట్ల‌ర్

Jos Butler : ఐపీఎల్ -2022 రిచ్ లీగ్ లో భాగంగా జ‌రిగిన క్వాలిఫ‌యిర్ -2 లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ గ్రాండ్ స‌క్సెస్ సాధించింది. రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరును 7 వికెట్ల తేడాతో ఓడించి ఫైన‌ల్ కు వెళ్లింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ చ‌రిత్ర‌లో కేవ‌లం ఒకే ఒక్క సారి మాత్రమే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టైటిల్ గెలిచింది. ఆస్ట్రేలియా దిగ్గ‌జ ఆట‌గాడు, దివంగ‌త షేన్ వార్న్ సార‌థ్యంలో రాజ‌స్తాన్ మొద‌టిసారిగా 2008లో క‌ప్పు కైవ‌సం చేసుకుంది.

ఆనాటి నుంచి నేటి దాకా టైటిల్ ఆ జ‌ట్టుకు అంద‌నంత దూరంలో ఉంది. 14 ఏళ్ల విరామం త‌ర్వాత రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఈసారి ఫైన‌ల్ కు చేరింది.

మొద‌ట బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 157 ర‌న్స్ చేస్తే రాజ‌స్తాన్ 3 వికెట్లు కోల్పోయి 160 ర‌న్స్ చేసింది. ఈ మ్యాచ్ లో అద్భుత‌మైన సెంచ‌రీ సాధించి దుమ్ము రేపాడు ఇంగ్లాండ్ స్టార్ హిట్ట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్(Jos Butler).

ప్ర‌స్తుతం ఈ క్రికెట‌ర్ ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ టోర్నీలో అత్య‌ధిక ప‌రుగులు చేసిన క్రికెట‌ర్ గా చ‌రిత్ర సృష్టించాడు. మొత్తం 16 ఇన్నింగ్స్ ల‌లో 824 ర‌న్స్ చేశాడు.

అద్భుత సెంచ‌రీతో ఆక‌ట్టుకున్న బ‌ట్ల‌ర్(Jos Butler)  కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అనంత‌రం మీడియాతో మాట్లాడాడు.

ఈ స‌మ‌యంలో దిగ్గ‌జ ప్లేయ‌ర్ షేన్ వార్న్ లేక పోవ‌డం త‌న‌ను బాధ‌క గురి చేస్తోంద‌న్నాడు.

తాము సాధించిన ఈ విజ‌యాన్ని పై నుంచి చూసి ఆనందిస్తూ ఉంటాడ‌ని పేర్కొన్నాడు. స‌మిష్టి కృషితో ఫైన‌ల్స్ కు వ‌చ్చామ‌న్నాడు.

ప్ర‌త్యేకంగా హెడ్ కోచ్ కుమార సంగ‌క్క‌ర‌, ట్రెవార్ పెన్నీతో సంభాష‌ణ‌లు ఎప్ప‌టికీ మ‌రిచి పోలేన‌ని చెప్పారు జోస్ బ‌ట్ల‌ర్. వేలాది మంది (ల‌క్ష)

స‌మ‌క్షంలో ఆడ‌డం త‌న‌కు సంతోషం క‌లిగించంద‌ని అన్నాడు.

Also Read : మెక్ కాయ్ నిబ‌ద్ద‌త గొప్ప‌ది – సంగ‌క్క‌ర‌

Leave A Reply

Your Email Id will not be published!