NTR LEGEND : ఆత్మ‌గౌర‌వ ప‌తాకం ఎన్టీఆర్ ప్ర‌స్థానం

యుగ పురుషుడు మహా నాయ‌కుడు

NTR LEGEND : తెలుగు వారి ఆత్మ గౌర‌వ ప‌తాకం ఎన్టీఆర్(NTR LEGEND). నంద‌మూరి తార‌క రామారావు గా ప్ర‌సిద్ది చెందిన న‌టుడు, నాయ‌కుడు. ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రానికి సీఎంగా ప‌ని చేసిన ఆయ‌న జీవితంలో ఎన్నో ప్ర‌భావితం చేసే అంశాలు ఉన్నాయి.

తెలుగుదేశం పార్టీని స్థాపించి అతి త‌క్కువ కాలంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘ‌న‌త , చ‌రిత్ర ఎన్టీఆర్ సొంతం. ఆ మూడు అక్ష‌రాలు ఆత్మ గౌరానికి ప్ర‌తీక‌లు. సామాన్యులే జెండాగా త‌న రాజ‌కీయ ప్ర‌స్థానం సాగించారు.

ఎన్నో మెరుపులు ఉన్నా మ‌రికొన్ని మ‌ర‌క‌లు కూడా లేక పోలేదు. ఏపీలోని కృష్ణా జిల్లా నిమ్మ‌కూరులో 1923 మే 28న పుట్టారు. 1996 జ‌న‌వ‌రి 18న మ‌హాభినిష్క్ర‌మ‌ణం చేశారు. విశ్వ విఖ్యాత న‌ట సార్వ భౌముడిగా పేరొందారు.

అంద‌రితో ఎన్టీఆర్(NTR LEGEND) అని నోరారా పిలుచుకునేలా చేశాడు. క్ర‌మశిక్ష‌ణ‌కు మారు పేరు ఆయ‌న‌. ఏ మాత్రం ఒక్క నిమిషం ఆల‌స్యం చేసినా ఎన్టీఆర్ ఊరుకునే వారు కారు. ఆయ‌న‌ను చూసి చాలా మంది త‌మ గ‌డియారాల‌ను స‌రి చేసుకున్న సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి.

ప్ర‌జా నాయ‌కుడిగా, అరుదైన న‌టుడిగా పేరొందారు. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో క‌లిపి 400 సినిమాల్లో న‌టించారు. ప‌లు చిత్రాలు నిర్మించి,

తానే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

పౌరాణిక‌, జాన‌ప‌ద‌, సాంఘిక చిత్రాల‌లో త‌న‌దైన శైలిలో న‌టించి మెప్పించారు. తెలుగు వారి హృద‌యాల‌లో శాశ్వ‌త ముద్ర వేసుకున్నారు ఎన్టీఆర్.

ఏడేళ్ల పాటు సీఎంగా ప‌ని చేశారు.

ఆయ‌న పార్టీ ఏర్పాటుతో ఎంద‌రో నాయ‌కులుగా మారారు. మ‌రికొంద‌రికి రాజ‌కీయ భ‌విష్య‌త్తు క‌ల్పించారు. ఎన్టీఆర్ కు ఏక‌సంతాగ్ర‌హి అని కూడా పేరుంది. సాహిత్యం, క‌ళ‌లు అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. ఎన్నో అవార్డులు వ‌రించాయి.

డాక్ట‌రేట్ కూడా పొందారు. చైత‌న్య ర‌థానికి శ్రీ‌కారం చుట్టాడు. తెలుగుదేశం పిలుస్తోంది రా ..క‌దలి రా అంటూ పిలుపునిచ్చిన ఎన్టీఆర్(NTR LEGEND) కు జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఆనాటి కాంగ్రెస్ పార్టీని ఏకి పారేశాడు. సినిమా డైలాగుల‌తో హోరెత్తించాడు.

ప్ర‌జ‌లు నీరాజ‌నాలు ప‌లికారు. కొన్ని నిర్ణ‌యాలు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా మారాయి. ఆనాటి గ‌వ‌ర్న‌ర్ రాం లాల్ ఎన్టీఆర్ ను తొలగించారు.

దీంతో తిరిగి ప్ర‌జ‌ల్లోకి వెళ్లాడు ఎన్టీఆర్. ఎన్నో సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నాడు.

1985లో ప్ర‌జ‌ల తీర్పు కోరుతూ మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల‌కు వెళ్లాడు. ట్యాంక్ బండ్ పై విగ్ర‌హాలు ఏర్పాటు చేశాడు. ఆ త‌ర్వాత తీసుకున్న నిర్ణ‌యాల‌పై వ్య‌తిరేక వ్య‌క్త‌మైంది.

ఆనాడు పీవీకి పోటీగా ఎవ‌రినీ నిల‌బెట్ట‌లేదు. తెలుగు వాడి కోసం తాను ఈ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు ఎన్టీఆర్

1993లో ల‌క్ష్మి పార్వ‌తిని పెళ్లి చేసుకోవ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.

ఆయ‌న ప్ర‌వేశ పెట్టిన రెండు రూపాయ‌ల‌కు కిలో బియ్యం, సంపూర్ణ మద్య నిషేధం , మ‌హిళ‌ల‌కు ఆస్తి హ‌క్కు, త‌దిత‌ర హామీలు మంచి పేరు

తీసుకు వ‌చ్చాయి. ల‌క్ష్మీ పార్వ‌తి మితి మీరిన జోక్యం కార‌ణంగా ఎమ్మెల్యేలు వ్య‌తిరేకంగా మారారు.

చంద్ర‌బాబు నేతృత్వంలో బ‌య‌ట‌కు వ‌చ్చారు. దీనిని త‌ట్టుకోలేక గుండె పోటుతో మ‌ర‌ణించారు ఎన్టీఆర్. కాగా ఎన్టీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా

ప్ర‌తీ ఏటా మే 28న టీడీపీ చేసుకునే ఉత్స‌వం.

40 ఏళ్ల ఆవిర్భావ వేడుక‌లు విజ‌య‌వాడ‌లో ఇవాళ జ‌ర‌గ‌నున్నాయి. న‌క్స‌లైట్లు దేశ భ‌క్తులు అన్న ఏకైక సీఎం ఎన్టీఆర్ . ఏది ఏమైనా ఎన్టీఆర్ చెర‌గ‌ని సంత‌కం.

Also Read : మ‌హిళా స్వ‌రం భావోద్వేగాల స‌మ్మేళ‌నం

Leave A Reply

Your Email Id will not be published!