RR IPL 2022 Finals : వాళ్లతోనే ఫైనల్స్ కు ఆడనున్న రాజస్తాన్
కీలకం కానున్న టాస్ విన్ ..శాంసన్ కు పరీక్ష
RR IPL 2022 Finals : ఐపీఎల్ 2022 ఫైనల్స్ కు రాజస్తాన్ రాయల్స్(RR IPL 2022 Finals) సేమ్ టీమ్ నే కొనసాగించనుంది. ఈ మేరకు
క్వాలిఫయిర్ -2లో రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
దీంతో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండానే ఇదే జట్టును కొనసాగించేందుకే రాజస్తాన్ రాయల్స్ టీమ్ హెడ్ కోచ్ కుమార సంగక్కర ప్రయారిటీ ఇస్తున్నట్లు సమాచారం.
స్టార్టింగ్ నుంచే బ్యాటింగ్ కు దిగితే అటాకింగ్ మొదలు పెట్టడం ముఖ్యమని నమ్ముతోంది. ఇక ఆటగాళ్ల పరంగా చూస్తే యశస్వి జైస్వాల్
ఆరంభంలో పరుగులు సాధించడం విశేషం.
ఫైనల్ లో కూడా సత్తా చాటే చాన్స్ ఉంది. ఇక జోస్ బట్లర్ ఐపీఎల్ టోర్నీలో టాప్ లో ఉన్నాడు. ఇప్పటి దాకా 16 మ్యాచ్ లలో ఆడి 824 పరుగులు చేశాడు. ఒక్కసారి కుదురు కున్నాడంటే ఇక ఆపడం ఎవరి తరం కాదు.
ఇప్పటి వరకు నాలుగు సెంచరీలు సాధించాడు. సంజూ శాంసన్ కీలక ఇన్నింగ్స్ లు ఆడక పోవడం ఇబ్బందికరంగా మారింది. అతడు
నిలదొక్కు కోవడం ముఖ్యం.
ఇక దేవదత్ పడిక్కల్ రాణిస్తే జట్టుకు మేలవుతుంది. ఎలాగైనా సరే ఆడాలని చూసే చాన్స్ ఉంది. సిమ్రోన్ హిట్ మైర్ ఆఖరి మ్యాచ్ లో
తన పూర్వ వైభవాన్ని చాటాలని అనుకుంటున్నాడు.
రియాన్ పరాగ్ అటు బ్యాటర్ గా జట్టుకు 6వ బౌలర్ గా కూడా పనికి వస్తాడు. ఆర్. అశ్విన్ స్పిన్నరే కాదు బ్యాటర్ కూడా. ఆల్ రౌండర్ గా
పేరొందాడు. ఇక ట్రెంట్ బౌల్ట్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం కలిసొచ్చే అంశం.
ఇక ప్రసిద్ద్ కృష్ణ ఇప్పటి వరకు 18 వికెట్లు తీశాడు. కీలకంగా మారనున్నాడు. చాహల్ 26 వికెట్లు తీశాడు. మెక్ కాయ్ డెత్ బౌలింగ్ లో సూపర్ బౌలింగ్ చేయడం కూడా ఆ జట్టుకు కలిసి రానుంది.
Also Read : కోట్లాది కళ్లన్నీ మోదీ స్టేడియం పైనే