Gujarat Titans Win : గుజ‌రాత్ టైటాన్స్ రియ‌ల్ చాంపియ‌న్స్

7 వికెట్ల తేడాతో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓట‌మి

Gujarat Titans Win : అంతా అనుకున్న‌ట్టుగానే జ‌రిగింది. ఎలాంటి ట్విస్టులు లేకుండానే ఆడుతూ పాడుతూ సునాయ‌సంగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ 2022 టైటిల్ ను కొత్త జ‌ట్టు మొద‌టిసారిగా కైవ‌సం చేసుకుంది. జ‌గ‌జ్జేత‌గా నిలిచింది.

రెండు నెల‌ల‌కు పైగా అల‌రిస్తూ, ఆద‌ర‌ణ చూర‌గొంటూ మెస్మ‌రైజ్ చేసిన కోట్లాది క్రీడాభిమానుల‌కు పండుగ మిగిల్చింది. గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ మోదీ స్టేడియంలో ల‌క్షా 25 వేల మందికి పైగా ఆసీనులైన ప్రేక్ష‌కుల జ‌య జ‌య ధ్వానాల మ‌ధ్య హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజ‌రాత్ టైటాన్స్(Gujarat Titans Win) అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది.

ఒక ర‌కంగా ఐపీఎల్ చ‌రిత్ర‌లో కొత్త చ‌రిత్ర‌కు శ్రీ‌కారం చుట్టింది. వ‌స్తూనే ఎలాంటి అంచ‌నాలు లేకుండా అడుగు పెట్టింది గుజ‌రాత్.

గాయాల పాలై, పూర్ ప‌ర్ ఫ‌ర్ ఫార్మెన్స్ తో భార‌త జ‌ట్టుకు దూర‌మై ఉన్న హార్దిక్ పాండ్యాను గుజ‌రాత్ టైటాన్స్(Gujarat Titans Win) యాజ‌మాన్యం ఏరికోరి ఎంచుకుంది. ఆశిష్ నెహ్రా హెడ్ కోచ్ గా అద్భుతాలు చేసింది.

ప్ర‌తి ఒక్క ఆట‌గాడు మ్యాచ్ విన్న‌ర్ గా త‌యారు చేయ‌డంలో కోచ్ స‌క్సెస్ అయ్యాడు. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఏ మాత్రం పోరాడ లేక పోయింది.

9 వికెట్లు కోల్పోయి కేవ‌లం 130 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మై పోయింది. గుజ‌రాత్ లో కెప్టెన్ పాండ్యా ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న ఆక‌ట్టుకుంది. 17 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 3 వికెట్లు తీశాడు.

ఆపై జ‌ట్టుకు విజ‌యాన్ని చేకూర్చ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. మొత్తంగా క‌లిసి క‌ట్టుగా ఆడితే జ‌ట్టు స‌క్సెస్ ఖాయమ‌ని స్ప‌ష్టం చేసింది. ఏది ఏమైనా క్రీడా స్పూర్తిని చాటింది ఐపీఎల్. మొత్తంగా ఐపీఎల్ పండుగ ముగిసింది.

Also Read : అద్భుత విజ‌యం స‌మిష్టి ఫ‌లితం

Leave A Reply

Your Email Id will not be published!