Kumar Sangakkara : వెల్ డన్ బాయ్స్ – కుమార సంగక్కర
జట్టు ఆట తీరు అద్భుతం
Kumar Sangakkara : ఐపీఎల్ 2022 పండుగ ముగిసింది. ఎలాంటి అంచనాలు లేని రాజస్తాన్ రాయల్స్ జట్టును ఫైనల్స్ చేరుకునేలా చేశాడు శ్రీలంక క్రికెట్ మాజీ దిగ్గజం హెడ్ కోచ్ , క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ కుమార సంగక్కర(Kumar Sangakkara).
దుబాయ్ వేదికగా జరిగిన 2021 ఐపీఎల్ లో నిరాశ పరిచిన రాజస్తాన్ ను దుర్బేద్యమైన జట్టుగా తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్బంగా ఫైనల్ మ్యాచ్ అనంతరం సంగక్కర హర్ష బోగ్లేతో మాట్లాడాడు.
గెలుపొందిన గుజరాత్ టైటాన్స్ ను అభినందించాడు. ఇదే సమయంలో సంజూ శాంసన్ కు కితాబు ఇచ్చాడు. భారత జట్టుకు ఎంపికయ్యే అన్ని లక్షణాలు ఉన్నాయన్నాడు.
ఇక కెప్టెన్ గా రాణించాడని, జట్టును ముందుండి నడిపించాడని కితాబు ఇచ్చాడు కుమార సంగక్కర(Kumar Sangakkara). ఇదే సమయంలో జట్టు సమిష్టిగా ఆడిందని, ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నాడు.
వచ్చే సీజన్ లో మరింతగా రాణించేలా చేస్తానని చెప్పాడు ఈ హెడ్ కోచ్. కొంత నిరాశ కలిగించినా 2008 ఐపీఎల్ తర్వాత మొదటిసారి 14 ఏళ్ల అనంతరం రాజస్తాన్ రాయల్స్ ను ఫైనల్స్ కు వెళ్లేలా చేసినందుకు ఆనందంగా ఉందన్నాడు.
బౌలింగ్ విభాగంలో లసిత్ మళింగ అద్భుతంగా ప్రయత్నం చేశాడని ప్రశంసించాడు. మొత్తంగా ఈ లీగ్ తన జీవితంలో మరిచి పోలేనిదిగా ఉంటుందన్నాడు సంగక్కర. జట్టు ఓడి పోయి ఉండవచ్చు కానీ అద్భుతమైన నైపుణ్యం కలిగి ఉందన్నాడు.
ప్రధానంగా జోస్ బట్లర్ ఆడిన తీరు అద్భుతం. ఇక చాహల్ సైతం కీలకంగా మారాడు. అశ్విన్ , ప్రసిద్ద్ కృష్ణ, మెక్ కాయ్, ట్రెంట్ బౌల్ట్ , శాంసన్ ఎవరికి వారు రాణించారని తెలిపాడు.
Also Read : ఆశిష్ నెహ్రా కనిపించని విజేత