Jos Butler Orange Cap : ఆరెంజ్ క్యాప్ విజేత బ‌ట్ల‌ర్

ఐపీఎల్ లో ర‌న్స్ ల‌లో టాప్

Jos Butler Orange Cap : ప్ర‌తి ఏటా జ‌రిగే ఐపీఎల్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడికి ప్ర‌త్యేకంగా ఆరెంజ్ క్యాప్ పేరుతో అవార్డు ఇస్తారు. ఈసారి జ‌రిగిన ఐపీఎల్ 2022లో వ్య‌క్తిగ‌త ప‌రుగుల జాబితాలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ స్టార్ ఓపెన‌ర్, స్టార్ హిట్ట‌ర్ వ‌ర‌ల్డ్ క్లాస్ క్రికెట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్(Jos Butler Orange Cap) టాప్ లో నిలిచాడు.

అత్య‌ధిక ఫోర్లు, సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాడిగా కూడా నిలిచాడు. ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. భారీ ఎత్తున క్యాష్ ప్రైజ్ కూడా అత‌డికే ద‌క్క‌డం విశేషం. ఏకంగా 4 సెంచ‌రీలు, హాఫ్ సెంచ‌రీలు చేశాడు.

జ‌ట్టు విజ‌యాల‌లో కీల‌క పాత్ర పోషించాడు జోస్ బ‌ట్ల‌ర్(Jos Butler Orange Cap). ఇక ఈ టోర్నీలో బ‌ట్ల‌ర్ ద‌రి దాపుల్లోకి ఏ ఆట‌గాడు రాలేక పోయాడు. కేఎల్ రాహుల్ ఉన్న‌ప్ప‌టికీ ఆశించిన మేర క్వాలిఫ‌యిర్ కు చేరుకోక పోవ‌డంతో చాన్స్ మిస్స‌య్యాడు.

ఈ ఆరెంజ్ క్యాప్ రేసులో సీఎస్కేకు చెందిన రుతురాజ్ గైక్వాడ్ కూడా ఉన్నాడు. కీల‌క‌మైన క్వాలిఫ‌యిర్ -2 మ్యాచ్ లో ఏకంగా సెంచ‌రీ బాదాడు. 106 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై.

ఒక ర‌కంగా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్ట‌లో జోస్ బ‌ట్ల‌ర్ ఆరెంజ్ క్యాప్ విజేత‌గా నిలిస్తే యజువేంద్ర చాహ‌ల్ 27 వికెట్లు తీసి ప‌ర్పుల్ క్యాప్ అందుకున్నాడు.

ఒక ర‌కంగా ఐపీఎల్ టోర్నీలో రాజ‌స్తాన్ ఓట‌మి పాలైనా ప్ర‌ధాన అవార్డులు మాత్రం రాయ‌ల్స్ జ‌ట్టు ఆట‌గాళ్లు ద‌క్కించు కోవ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా త‌న ద‌రిదాపుల్లోకి ఎవ‌రూ రాకుండా ప‌రుగుల వర‌ద పారించాడు జోస్ బ‌ట్ల‌ర్.

Also Read : వెల్ డ‌న్ బాయ్స్ – కుమార‌ సంగ‌క్క‌ర‌

Leave A Reply

Your Email Id will not be published!