Modi Stadium Flags : జాతీయ పతాకం మా తుఝే సలాం
వందే మాతరం..జై హోతో దద్దరిల్లిన స్టేడియం
Modi Stadium Flags : దేశాన్ని కలిపి ఉంచేది ఆట ఒక్కటే. ఈ దేశంలో ఎన్నో కులాలు, మతాలు, జాతులు, వర్గాలతో నిండి పోయి ఉంది. ఏకంగా ప్రపంచంలోనే చైనా తర్వాత ఎక్కువ జనాభా కలిగిన దేశంగా భారత్ ఉంది.
135 కోట్లకు పైగా జనం ఉన్న ఈ దేశంలో క్రికెట్ ఆటకు ఉన్నంత క్రేజ్ ఇంకే ఆటకు ఉండదు. ఈ దేశంలో క్రికెట్ అన్నది ఆట కాదు అది ఓ మతం అన్నాడు ఓ మేధావి.
భారత జట్టు విజయాలు సాధించిన సమయంలో ఎక్కువగా అభిమానులు తాము గౌరవంగా భావించే జాతీయ పతాకాలను ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది.
జాతీయ పతాకం అన్నది ఒక జెండా(Modi Stadium Flags) మాత్రమే కాదు. దేశ గౌరవానికి, ఆత్మ గౌరవానికి ప్రతీకగా భావిస్తారు. ఇక ప్రపంచంలోనే టాప్ లీగ్ గా పేరొందింది బీసీసీఐ ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) .
ప్రతి ఏటా అంతకంతకూ జనం పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా కోట్లల్లో వీక్షించిన ఏకైక లీగ్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్. ఇక ఈసారి ఐపీఎల్ రెండు నెలలకు పైగా లీగ్ జరిగింది.
గుజరాత్ లోని అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ , రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగింది. 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ పై గుజరాత్ గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది.
ఈ సందర్భంగా ఇరు జట్లకు చెందిన క్రీడాభిమానులు సపోర్ట్ చేశారు. పనిలో పనిగా స్టేడియం అంతా వందేమాతరం, జై హో గీతాలతో దద్దరిల్లింది.
ఎక్కడ చూసినా భారత దేశానికి చెందిన జాతీయ పతాకాలు(Modi Stadium Flags) రెప రెప లాడాయి. మేరా భారత్ మహాన్ అంటూ నినదించారు.
Also Read : రెహమాన్ స్వరం వందేమాతరం