Gary Kristen & Pandya : ఆటలోనే కాదు వినయంలో గొప్పోడు
పాండ్యాపై గ్యారీ కిరిస్టెన్ కామెంట్స్
Gary Kristen Pandya : గుజరాత్ టైటాన్స్ జట్టును ముందుండి నడిపించడమే కాదు ఆ జట్టుకు తొలిసారిగా ఎంట్రీ లోనే ఐపీఎల్ టైటిల్ అందించాడు హార్దిక్ పాండ్యా. మ్యాచ్ అనంతరం ఆ జట్టు మెంటార్ గ్యారీ కిరిస్టెన్(Gary Kristen) సంచలన కామెంట్స్ చేశాడు పాండ్యాపై.
అతడు ఉన్నత స్థాయి కలిగిన ఆటగాడు. అంతే కాదు ఆట లోనే కాదు వినయంలో కూడా గొప్పోడంటూ కితాబు ఇచ్చాడు కిరిస్టెన్. పాండ్యాను ప్రశంసలతో ముంచెత్తాడు.
కెప్టెన్ గా నేర్చుకునేందుకు పాండ్యా చూపిన ఆత్రుత, సహచరులతో సమర్థవంతంగా వ్యవహరించే సామర్థ్యం గుజరాత్ టైటాన్స్ ను టైటిల్ దక్కించుకునేలా చేసిందని పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా 2011లో ప్రపంచ కప్ టైటిల్ సాధించిన భారత జట్టుకు కోచ్ గా వ్యవహరించాడు గ్యారీ కిరిస్టెన్. కెప్టెన్ గా, ఆటగాడిగా రాణించిన హార్దిక్ పాండ్యా(Pandya) పై ప్రశంసలు కురుస్తున్నాయి.
నేను ఇదివరకు చూసిన ఆటగాళ్లలో పాండ్యా వెరీ వెరీ స్పెషల్. ఎప్పుడూ ఏదో నేర్చు కోవాలనే తపన అతడిలో చూశా. ప్రతిసారి విజయం సాధించాలనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు.
ఆ కసి ఇంకా అతడిలోనే ఉంది. గెలుపు వచ్చినప్పుడు సంతోష పడలేదు. ఓటమి పొందిన సమయంలో కుంగి పోలేదు. పాండ్యా అసలైన కెప్టెన్ కు అర్హుడంటూ కితాబు ఇచ్చాడు గ్యారీ కిరిస్టెన్(Gary Kristen Pandya).
అతడు చివరి దాకా ప్రయత్నం చేశాడు. తన జట్టు కోసం శ్రమించాడని తెలిపాడు. ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాడని తెలిపాడు గ్యారీ కిరిస్టెన్.
ఇక గుజరాత్ టైటాన్స్ విజయం వెనుక హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, మెంటార్ గా గ్యారీ కిరిస్టెన్ కీలక పాత్ర పోషించారు.
Also Read : జాతీయ పతాకం మా తుఝే సలాం