BCCI Anounces : శ్ర‌మ‌జీవుల‌కు బీసీసీఐ క్యాష్ ప్రైజ్

ప్ర‌క‌టించిన బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా

BCCI Anounces : రిచ్ లీగ్ ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ 2022 విజ‌య‌వంతంగా ముగిసింది. దీనిని భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) ఆధ్వ‌ర్యంలో ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ లో సార‌థ్యంలో నిర్వ‌హించారు.

భారీ స‌క్సెస్ ద‌క్కింది. కోట్లా రూపాయ‌ల ఆదాయం బీసీసీఐకి స‌మ‌కూరింది. ఆ సంఖ్య ఎంత వ‌చ్చింద‌నేది ఇప్ప‌టి వ‌ర‌కు చెప్ప‌లేదు. ప్ర‌క‌టించ‌దు కూడా. ఈ దేశంలో అత్య‌ధిక ఆదాయం క‌లిగిన క్రీడా సంస్థ బీసీసీఐ ఒక్క‌టే.

ఐపీఎల్ స‌క్సెస్ కావ‌డానికి ఎంతో మంది ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ప‌ని చేస్తారు. ప్ర‌ధానంగా మ్యాచ్ కొన‌సాగాలంటే, జ‌ట్లు ఆడాలంటే త‌ప్ప‌నిస‌రిగా కావాల్సింది పిచ్, స్టేడియం. మ‌రి పిచ్ బాగుండాలంటే దానిని నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తూ ఉండాలి.

ఎప్ప‌టిక‌ప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆట‌గాళ్ల‌కు సౌక‌ర్యంగా ఉండేలా తీర్చి దిద్దాలి. వీటిని ప‌ర్య‌వేక్షించేది పిచ్ క్యూరేట‌ర్లు, గ్రౌండ్స్ మెన్ లు. వారు లేక పోతే పిచ్ లు ఆడేందుకు అనువుగా ఉండ‌వు.

అందుకే వారి శ్ర‌మ‌ను గుర్తించింది ప్ర‌త్యేకంగా బీసీసీఐ(BCCI Anounces). ఈ మేర‌కు పిచ్ క్యూరేట‌ర్లు, గ్రౌండ్స్ మెన్ ల‌కు న‌జ‌రానా ప్ర‌క‌టించింది. ఈ ఏడాది చేప‌ట్టిన ఐపీఎల్ ఆరు వేదిక‌లలో నిర్వ‌హించారు.

వీటిలో ప‌ని చేసిన క్యూరేట‌ర్లు, గ్రౌండ్స్ మెన్ ల‌కు రూ. 1.25 కోట్ల ప్రైజ్ మ‌నీని ఇవ్వ‌నున్న‌ట్లు బీసీసీఐ(BCCI Anounces) సెక్ర‌ట‌రీ జే షా వెల్ల‌డించారు. ఈడెన్ గార్డెన్స్ కు రూ. 12.5 ల‌క్ష‌లు, న‌రేంద్ర మోదీ స్టేడియానికి రూ. 12.5 ల‌క్ష‌లు కేటాయించారు.

నాలుగు వేదిక‌ల క్యూరేట‌ర్లు, గ్రౌండ్స్ మెన్ ల‌కు రూ. 25 ల‌క్ష‌లు అంద‌జేయ‌నున్నారు. వీరిని తెర వెనుక హీరోలుగా జే షా పేర్కొన్నారు.

Also Read : ఆట‌లోనే కాదు వినయంలో గొప్పోడు

Leave A Reply

Your Email Id will not be published!