Gamini Singla Dance : సివిల్స్ టాప‌ర్ సింగ్లా డ్యాన్స్ వైర‌ల్

యూపీఎస్సీ 2021లో టాప్ 3 ర్యాంక్

Gamini Singla Dance : దేశంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) నిర్వ‌హించే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్షలో 2021కి గాను ఫైన‌ల్ ఫ‌లితాలు వెల్ల‌డయ్యాయి.

టాప్ మూడు ర్యాంకుల‌లో మ‌హిళ‌లే టాప్ గా నిలిచారు. శ్రుతి శ‌ర్మ నెంబ‌ర్ వ‌న్ గా నిలిస్తే గామిని సింగ్లా దేశ వ్యాప్తంగా 3వ ర్యాంకు సాధించింది.

దీంతో విష‌యం తెలిసిన వెంట‌నే గామిని సింగ్లా ఆల‌యాన్ని సంద‌ర్శించారు త‌న కుటంబీకుల‌తో. దేవుడికి పూజ‌లు చేసింది. అనంత‌రం ఇంటికి వ‌చ్చిన ఆమె కుటుంబీకుల‌తో క‌లిసి డ్యాన్స్ చేసింది.

ప్రస్తుతం గామిని సింగ్లా(Gamini Singla Dance)  చేసిన డ్యాన్స్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఆమెకు అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.

కుటుంబీకులు, స్నేహితులు, ఇత‌రులు కూడా గామిని సింగ్లాను ప్ర‌శంసిస్తున్నారు. సింగ్లా(Gamini Singla Dance) తో పాటు పేరెంట్స్ కూడా సంతోషం ప‌ట్ట‌లేక ఆనందాన్ని పంచుకోవ‌డం సంతోషం క‌లిగించింది.

ఈ సంద‌ర్భంగా ఈ సుదీర్ఘ సివిల్ స‌ర్వీసెస్ ప్ర‌యాణంలో త‌న‌కు మద్ద‌తుగా నిలిచిన కుటుంబ స‌భ్యుల‌కు ఆమె ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ ప‌రీక్ష‌లో చ‌రిత్ర విద్యార్థిని శ్రుతి శ‌ర్మ టాప‌ర్ గా నిలిస్తే అంకితా అగ‌ర్వాల్ రెండో స్థానంలో నిలిచింది.

మూడో స్థానంలో సింగ్లా ఉన్నారు. ఆరు సంవ‌త్స‌రాల త‌ర్వాత ఈసారి మూడు ర్యాంకులు మ‌హిళా అభ్య‌ర్థులు ద‌క్కించుకున్నారు. 2015లో మొద‌టి నాలుగు స్థానాలు మ‌హిళ‌లే సాధించారు.

మొత్తం 685 మంది అభ్య‌ర్థులు ఎంపిక కాగా అందులో 508 మంది పురుషులు ఉండ‌గా 177 మంది మ‌హిళ‌లు ఉన్నారు.

Also Read : ఫోటోలు..ఫైల్స్ దుర్వినియోగం – మాజీ సిఇఓ

Leave A Reply

Your Email Id will not be published!