Shoaib Akhtar Kohli : కోహ్లీ అన్ని కాలాల్లో అత్యుత్త‌మ క్రికెట‌ర్

పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ షోయ‌బ్ అక్త‌ర్

Shoaib Akhtar Kohli : పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్, స్టార్ బౌల‌ర్ షోయ‌బ్ అక్త‌ర్(Shoaib Akhtar) సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. కోహ్లీ 110 సెంచ‌రీలు చేస్తాడ‌ని పందెం వేస్తానంటూ పేర్కొన్నాడు.

ఒక పాకిస్తానీగా తాను..చెబుతున్నాన‌ని..ప్ర‌పంచంలోని క్రికెట్ లో అత్యుత్త‌మ ఆట‌గాళ్ల‌లో కోహ్లీ ఒక‌డ‌ని పేర్కొన్నాడు.

అన్ని కాలాల‌లో అద్భుత‌మైన ఆట‌గాడు కోహ్లీ అని ప్ర‌శంసించాడు. 2015 నుంచి 2019 మ‌ధ్య కాలంలో అద్భుతంగా ఆడాడు. ట‌న్నుల కొద్దీ ప‌రుగులు సాధించాడు.

వ‌ర‌ల్డ్ లో తాను ఇప్ప‌టి వ‌ర‌కు చూసిన క్రికెట‌ర్ల‌లో కోహ్లీ లాగా ఆడిన ఆట‌గాడిని చూడ‌లేద‌ని పేర్కొన్నాడు. ఎంత మంచి ఆట‌గాడికైనా కొంత ఇబ్బంది ఎదుర్కొన‌డం ఖాయం.

బ్యాట‌ర్ గా విరాట్ కోహ్లీ 2019 న‌వంబ‌ర్ నుండి ప‌రుగులు చేసేందుకు ఇబ్బంది ప‌డ్డాడ‌ని తెలిపాడు షోయ‌బ్ అక్త‌ర్(Shoaib Akhtar Kohli). ఇప్ప‌టి వ‌ర‌కు సెంచ‌రీ సాధించ లేదు. అయినా కోహ్లీని మించిన బ్యాట‌ర్ ఇంత వ‌ర‌కు రాలేద‌న్నాడు.

ఇక కెప్టెన్ గా త‌ప్పుకున్నాడు. ఐపీఎల్ లో రాణించ లేదు. కానీ విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ మాత్రం త‌గ్గ‌లేదు. ఐపీఎల్ 2022లో 16 మ్యాచ్ లు ఆడాడు. 22.73 స‌గ‌టుతో 341 ప‌రుగులు చేశాడు.

ఇందులో రెండు హాఫ్ సెంచ‌రీలు మాత్ర‌మే ఉన్నాయి. కానీ త‌న జ‌ట్టును ఫైన‌ల్ కు తీసుకు వెళ్ల‌డంలో ఫెయిల్ అయ్యాడు. మాజీ క్రికెట‌ర్లు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కోహ్లీ(Kohli) ప‌ని అయి పోయిందంటూ ఎద్దేవా చేశారు.

కానీ పాకిస్తాన్ మాజ క్రికెటర్ మాత్రం కోహ్లీకి మ‌ద్ద‌తుగా నిలిచాడు. అత‌డిని విమ‌ర్శించ‌కండి. అత‌డికి ఆడేందుకు చాన్స్ ఇవ్వండి. మ‌ళ్లీ మునుప‌టి స్టార్ ను చూస్తార‌ని ధీమా వ్య‌క్తం చేశాడు.

Also Read : భ‌విష్య‌త్తులో కెప్టెన్ అయ్యే చాన్స్

Leave A Reply

Your Email Id will not be published!