Hockey Mens India : ఆసియా కప్ భారత్ ఆశలు ఆవిరి
దక్షిణ కొరియాతో మ్యాచ్ డ్రా
Hockey Mens India : ఎలాగైనా సరే మెన్స్ హాకీ(Hockey Mens India) ఆసియా కప్ ఈసారి గెలుస్తుందని ఆశించిన భారత అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది మెన్స్ హాకీ జట్టు. ఫైనల్ చేరకుండానే ఇంటి బాట పట్టింది. సూపర్ -4 లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
మంగళవారం దక్షిణ కొరియాతో భారత్ మ్యాచ్ కొనసాగింది. ఇరు జట్టు మ్యాచ్ ముగిసే సరికి చెరి సమానంగా గోల్స్ చేశాయి. 4 గోల్స్ దక్షిణ కొరియా చేస్తే భారత జట్టు కూడా 4 గోల్స్ చేయడంతో కీలక మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఇదిలా ఉండగా పాయింట్ల పట్టికలో భారత్ , కొరియా జట్లు సరిసమానంగా నిలిచాయి. చెరో ఐదు పాయింట్లు సాధించాయి. కాగా జపాన్ తో జరిగిన మరో కీలక మ్యాచ్ లో మలేషియా ఘన విజయాన్ని నమోదు చేసింది.
దీంతో ఆ జట్టు గెలుపు భారత్ విజయావకాశాలను దెబ్బ తీసింది. ఇక మలేషియా కూడా ఐదు పాయింట్లు సాధించింది. మెరుగైన గోల్స్ సాధించడంతో మెరుగైన గోల్స్ సాధించడంతో మలేషియా , దక్షిణ కొరియాలు ఆసియా కప్ ఫైనల్ కు చేరుకున్నాయి.
ఇక ఫైనల్ మ్యాచ్ ఆశలు అడుగంటడంతో ఇక భారత్ , జపాన్ జట్టు మూడో స్థానం కోసం పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ బుధవారం కొనసాగనుంది.
దీంతో ఎలాగైనా సరే కప్ గెలుస్తుందని ఆశించిన వారి ఆశలపై నీళ్లు చల్లారు హాకీ(Hockey Mens India) ప్లేయర్లు. ఇదిలా ఉండగా బుధవారం రోజు మెన్స్ ఆసియా కప్ కోసం ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Also Read : ఐపీఎల్ ఉత్తమ జట్టుకు అతడే కెప్టెన్