Temba Bavuma : సత్తా చాటుతాం విజయం సాధిస్తాం
సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా
Temba Bavuma : భారత్ లో ఐపీఎల్ పండుగ ముగిసింది. ఇండియాలో పర్యటించేందుకు సౌతాఫ్రికా రానుంది. ఇందులో భాగంగా 5 మ్యాచ్ లు ఆడనుంది. టీ20 సీరీస్ ఈనెల 9 నుంచి ప్రారంభమవుతుంది.
ఇప్పటికే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు – బీసీసీఐ 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. భారత్ తో ఆడే సౌతాఫ్రికా జట్టుకు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తెంబా బవుమా(Temba Bavuma) ను కెప్టెన్ గా ప్రకటించింది.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టును తక్కువగా అంచనా వేయొద్దన్నాడు. తాము వంద శాతం ఎఫర్ట్ పెడతామని, భారత జట్టును ఓడించడం ఖాయమన్నాడు.
ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు జరగడం ఖాయమన్నాడు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఇప్పటికే భారత సెలెక్షన్ కమిటీ పలు ప్రయోగాలు చేస్తోంది.
తాజాగా ఎంపిక చేసిన టీంను ఎక్కువ శాతం ఐపీఎల్ లో సత్తా చాటిన వారిని ఎంపిక చేసింది. విచిత్రం ఏమిటంటే ఫుల్ జోష్ లో ఉన్న శిఖర్ ధావన్ ను పక్కన పెట్టడం విమర్శలకు దారి తీసింది.
ఈ తరుణంలో సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా చేసిన కామెంట్స్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. రోహిత్ శర్మ కు విశ్రాంతి ఇచ్చింది. కేఎల్ రాహుల్ కు పగ్గాలు అప్పగించింది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు సౌతాఫ్రికా స్కిప్పర్ బవుమా. మా జట్టులో నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. ఇండియాలో ఉన్న ఆటగాళ్లకు ఉన్నంత వెసులుబాటు ఉండదన్నాడు. రోహిత్, కోహ్లీని పూర్తిగా పక్కన పెట్టింది బీసీసీఐ.
Also Read : శుభ్ మన్ గిల్ దమ్మున్నోడు – రషీద్ ఖాన్